కమ్మేసిన ఆదిపురుష్ మేనియా.. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఇది ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హై బడ్జెట్ మూవీ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్ గా జరుగుతోంది.. ప్రభాస్ ఫ్యాన్స్ తో తారకరామ స్టేడియం కిక్కిరిసిపోయింది..
సినిమా కోసం టీమ్ మొత్తం రోజుకు దాదాపు 20 గంటలు కష్టపడ్డారు.. ఓం రావత్ ఓ యుద్ధమే చేశాడు.. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు.. ఆదిపురుష్ చేయడం మా అదృష్టం-ప్రభాస్
ఏడాదికి రెండు సినిమాలు చేస్తా.. కొంచెం మాట్లాడుతా.. సంవత్సరానికి మూడు సినిమాలు కూడా రావొచ్చు.. స్టేజ్‌పై తక్కువ మాట్లాడుతా.. ఎక్కువ సినిమాలు చేస్తా-హీరో ప్రభాస్
రామయణం చేస్తున్నావా? అని చిరంజీవి గారు అడిగారు.. అది అదృష్టం.. అందరికీ దొరకదు ఆ అదృష్టం.. నీకు దొరికిందని చెప్పారు-హీరో ప్రభాస్
ఎక్కడైనా రామాయణం ప్రదర్శిస్తే హనుమంతుడు వచ్చి వీక్షిస్తాడట.. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే ప్రతీ థియేటర్‌లో ఒక్క సీటు ఖాళీగా ఉంచండి.. హనుమంతుడు వచ్చి వీక్షిస్తాడని భావిస్తా-దర్శకుడు ఓం రావత్
మానవజాతికి శ్రీరాముడు ఆదర్శప్రాయుడు అని తెలిపారు చిన్నజీయర్ స్వామి.. ఆయన్ని దేవుడుగా కొలిచేవారు ఉన్నారు.. కొలవడంలో తప్పులేదు.. కానీ, రాముడు మానవుడిగా బతికాడు.. ఆయన మహా విష్ణువు.. కానీ, మనిషిగానే సాధించాడు.. మంచి మనిషిగా బతికి.. తన వెంట అంతా నడిచేలా చేశారు..
భారత ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆదిపురుష్ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది.. రామాయణంలోని కొన్ని ఘట్టాలను తీసుకుని అత్యాధునికి టెక్నాలజీతో ఆదిపురుష్‌ని నిర్మించడం గొప్ప విషయం.. ఆదిపురుష్ సినిమా యూనిట్‌కు నా అభినందనలు.. శ్రీనివాసుడి ఆశీస్సులతో ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా-టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
#Prabhs Entry at Adipurush Pre Release Event
Watch Live>>>https://t.co/XugVcxmNfx#Adipurush #Prabhas #AdipurushPreReleaseEvent #kritisanon #devdattanage #omraut #saifalikhan #AdipurushActionTrailer #NTVENT #NTVTelugu pic.twitter.com/stW68wq8Ev
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 6, 2023
తిరుపతిలోని తారకరామ స్టేడియానికి చేరుకున్నారు హీరో ప్రభాస్.. గ్రాండ్‌గా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.. అభిమానులతో ఆ స్టేడియం కిక్కిరిసిపోయింది..
Kritisanon Entry @ Adipurush Pre Release Event
Watch Live>>>https://t.co/PcGNQ2whXI#Adipurush #Prabhas #RebalStarPrabhas #kritisanon #devdattanage #omraut #saifalikhan #AdipurushActionTrailer #NTVENT #NTVTelugu pic.twitter.com/IKQxWZQop2
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 6, 2023
శ్రీరాముడు లాంటి ఆకర్షణీయ రూపం ప్రభాస్ లో ఉంది..#AdipurushPreReleaseEvent #Adipurush #AdipurushActionTrailer #Prabhas #KritiSanon #OmRaut #Tirupati #NTVTelugu #NTVENT pic.twitter.com/zLRKzY6O9K
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 6, 2023
ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది..Exclusive Live Updates From Adipurush Pre Release Event#AdipurushPreReleaseEvent #Adipurush #AdipurushActionTrailer #Prabhas #KritiSanon #OmRaut #Tirupati #NTVTelugu #NTVENT pic.twitter.com/sz7nCQOkld
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 6, 2023
ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ డ్రోన్ విజువల్స్..
WATCH EVENT LIVE - https://t.co/XugVcxmNfx#AdipurushPreReleaseEvent #Adipurush #AdipurushActionTrailer #Prabhas #KritiSanon #OmRaut #Tirupati #NTVENT #NTVTelugu pic.twitter.com/OiFjY08mvN
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 6, 2023
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ట్ అయిన ప్రభాస్... #Adipurush #BhushanKumar #Pramod #Vamsi #KrishanKumar #AdipurushPreReleaseEvent #AdipurushActionTrailer #NTVENT #NTVTelugu pic.twitter.com/xymnQcGuQG
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 6, 2023
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైలైట్ గా నిలవనున్న V.Unbeatable టీం ప్రదర్శన..
WATCH EVENT LIVE - https://t.co/UEPYRpPNiK#AdipurushPreReleaseEvent #Adipurush #AdipurushActionTrailertoday#AdipurushActionTrailer #Prabhas #KritiSanon #OmRaut #Tirupati #NTVENT pic.twitter.com/P3nO7YepfO
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 6, 2023
జోరు వాన లో కూడా జై ప్రభాస్.. జై శ్రీ రామ్.. నినాదాలతో దద్దరిల్లిపోతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
WATCH EVENT LIVE - https://t.co/XugVcxmNfx#AdipurushPreReleaseEvent #Adipurush #AdipurushActionTrailer #Prabhas #KritiSanon #OmRaut #Tirupati #NTVENT pic.twitter.com/uISfWlNtav
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 6, 2023
హీరో ప్రభాస్ తిరుమల నుంచి తిరుపతికి బయల్దేరారు.. కాసేపట్లో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరుకానున్నారు.. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్‌తో తారకరామ స్టేడియం కిక్కిరిసిపోయింది..
తిరుపతిని కమ్మేసిన ఆదిపురుష్ మేనియా.. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఇది ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి.. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ.. ముఖ్యంగా ముంబై నుంచి భారీ సంఖ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ తరలివచ్చారు..
ఆదిపురుష్ ఈవెంట్ జరుగులోన్న తారకరామ స్టేడియంలో చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేసింది.. ఆ సెట్ చూస్తే.. మనం తిరుపతిలో ఉన్నామా? అయోధ్యలోనే ఉన్నామా..? అనేలా సెట్ ను వేశారు..
ఆదిపురుష్ ఈవెంట్ జరుగుతోన్న తారకరామ స్టేడియంలో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.. ఓవైపు డార్లింగ్.. మరోవైపు జై శ్రీరాం, జై ప్రభాస్.. జై రెబల్ స్టార్ అంటూ.. నినాదాలతో హోరెత్తిస్తున్నారు..
ఆదిపురుష్ ఈవెంట్ జరుగుతోన్న ప్రాంతంలో మొదట్లో వర్షం పడినా.. ఆ తర్వాత తగ్గిపోయింది.. అయితే, వర్షం పడుతోన్నా ఈవెంట్ కు మాత్రం పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు..
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెట్ లో భారీ వర్షం..
WATCH EVENT LIVE - https://t.co/PcGNQ2whXI#AdipurushPreReleaseEvent #Adipurush #AdipurushActionTrailertoday#AdipurushActionTrailer #Prabhas #KritiSanon #OmRaut #Tirupati #NTVENT pic.twitter.com/fRFeMQlw7v
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 6, 2023
ఆదిపురుష్ ఈవెంట్ జరుగుతోన్న ప్రాంతంలో వర్షపు చినుకులు పడుతున్నాయి.. కానీ, వర్షంలోనూ ప్రభాస్ ఫ్యాన్స్ వెనక్కి తగ్గడంల దే.. జైశ్రీరామ్ నినాదాలతో హోరెతిస్తున్నారు..