PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- రోజుకు రూ.100తో PhonePe Daily RD
- PhonePeలో FD ఎలా బుక్ చేసుకోవాలి?
- PhonePeలో FD బుక్ చేసుకునే విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PhonePe Daily RD: డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ PhonePe తన పెట్టుబడి సేవలను మరింత విస్తరించింది. యూజర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పెట్టుబడి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. రోజువారీగా చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టే Daily Recurring Deposit (RD) ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చింది. PhonePeలో అందుబాటులో ఉన్న Daily RD సేవను Shivalik Small Finance Bank భాగస్వామ్యంతో అందిస్తోంది. ఇందులో యూజర్లు రోజుకు కేవలం రూ.100 నుంచి రూ.1,000 వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. UPI AutoPay ద్వారా పెట్టుబడులను ఆటోమేటిక్‌గా కొనసాగించవచ్చు.
PhonePeలో FD ఎలా బుక్ చేసుకోవాలి?
PhonePe యాప్ ద్వారా భాగస్వామ్య బ్యాంకులు, NBFCలు అందిస్తున్న వివిధ FD ఆప్షన్లను ఒకే చోట చూసి.. తమకు నచ్చిన FDని నేరుగా బుక్ చేసుకోవచ్చు. వేర్వేరు భాగస్వామ్య బ్యాంకుల్లో బుక్ చేసిన FDలను ఒకే ప్లాట్‌ఫామ్ నుంచి నిర్వహించుకునే సదుపాయం కూడా ఉంది. PhonePe ప్రకారం.. భాగస్వామ్య బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లకు DICGC పథకం కింద రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
రోజుకు రూ.100తో RD ఎలా ప్రారంభించాలి?
PhonePe Daily RD ద్వారా చిన్న మొత్తాలతో క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునే వారికి పెట్టుబడి సులభతరం అవుతుంది. రోజుకు రూ.100 నుంచి రూ.1,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. UPI AutoPay ద్వారా ఆటోమేటిక్‌గా డబ్బు జమ అయ్యేలా ముందుగానే మాండేట్ను సెట్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ.. కాలక్రమేణా పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు.
PhonePeలో FD బుక్ చేసుకునే విధానం
స్టెప్ 1: PhonePe యాప్‌ను ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్‌లోని ‘Mutual Funds & Deposit’ విభాగంలోకి వెళ్లాలి.
స్టెప్ 2: అక్కడ Fixed Deposits లేదా Daily RD ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 3: అందుబాటులో ఉన్న భాగస్వామ్య బ్యాంకు లేదా NBFCని ఎంచుకోవాలి.
స్టెప్ 4: మీకు కావాల్సిన కాలపరిమితిని ఎంచుకుని పెట్టుబడి మొత్తాన్ని నమోదు చేయాలి. FDలకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాలపరిమితి ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
స్టెప్ 5: PAN, Aadhaar ద్వారా డిజిటల్ KYC/ఐడెంటిటీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
స్టెప్ 6: నామినీ వివరాలను నమోదు చేసి PhonePe UPI లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు పూర్తి చేయాలి.
Daily RD ఎంచుకున్నట్లయితే UPI AutoPay మాండేట్ను ఆథరైజ్ చేయాలి.
Shivalik Small Finance Bank RD వడ్డీ రేట్లు
PhonePe Daily RD భాగస్వామ్యంగా ఉన్న Shivalik Small Finance Bank ప్రకారం RDలకు కాలపరిమితిని బట్టి సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ఉన్నాయి.
కాలపరిమితి- సాధారణ కస్టమర్లు- సీనియర్ సిటిజన్లు
6–8 నెలలు 6.00% 6.50%
9–12 నెలలు 6.00% 6.50%
13–17 నెలలు 6.75% 7.25%
18–23 నెలలు 7.50% 8.00%
24–27 నెలలు 8.00% 8.50%
28–36 నెలలు 7.50% 8.00%
37–60 నెలలు 6.25% 6.75%
వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు PhonePe లేదా సంబంధిత బ్యాంకులో తాజా రేట్లు, నిబంధనలు పరిశీలించడం మంచిది.
RD అంటే ఏమిటి?
Recurring Deposit (RD) అంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టకుండా.. నిర్ణీత వ్యవధిలో చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా జమ చేసే డిపాజిట్ పథకం. ఉదాహరణకు రోజుకు రూ.100 చొప్పున పెట్టుబడి పెడితే చిన్న మొత్తాలతోనే పొదుపు ప్రారంభించవచ్చు. నిర్ణీత కాలం పూర్తయ్యే సమయానికి మీరు జమ చేసిన మొత్తానికి వర్తించే వడ్డీతో కలిపి మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది.
ఎవరికి ఉపయోగకరం?
రోజువారీ ఆదాయం నుంచి చిన్న మొత్తాన్ని పొదుపు చేయాలనుకునే వారికి PhonePe Daily RD ఉపయోగకరంగా ఉండొచ్చు. ముఖ్యంగా పెద్ద మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టడం కష్టంగా ఉన్నవారు రోజుకు చిన్న మొత్తంతో పొదుపును ప్రారంభించవచ్చు. అయితే RDలో పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ రేటు, మెచ్యూరిటీ మొత్తం, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు, ఛార్జీలు, పన్ను ప్రభావం వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?