Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lal Darwaza Bonalu: హైదరాబాద్ పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు వేళ నగరంలో పండుగ శోభ సంతరించుకుంది. ఏటా ఆషాఢమాసంలో వైభవంగా జరిగే ఈ జాతర కోసం అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం 4:30 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ అనంతరం దేవాలయం తరఫున తొలి బోనం సమర్పించారు. ఉదయం 6:00 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రభుత్వం తరఫున ఉదయం 10:30 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం నుంచి రాత్రి 10:30 గంటల వరకు భక్తులు బోనాలు, ఒడి బియ్యం, చీర, సారెను అమ్మవారికి నివేదించనుండగా, సాయంత్రం వేళ అమ్మవారి శాంతి కళ్యాణం వైభవంగా జరగనుంది. లాల్ దర్వాజాలోని ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల్లోని దాదాపు 3,000 చిన్న దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవాల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్త్రృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ఆవరణ చిన్నది కావడంతో భక్తుల కోసం 6 ప్రత్యేక క్యూలైన్లను, బోనం తీసుకొచ్చే వారికి ప్రత్యేక మార్గాన్ని రూపొందించారు. అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లు, ఉచిత వైద్య శిబిరాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. ముందస్తు సమాచారం అందించిన జోగిణులకు అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. ఇది సున్నితమైన ప్రాంతం కావడంతో 100 సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణతో పాటు 2,500 మంది సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రోజున ప్రతిష్టాత్మక ‘రంగం’ భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్రతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!