YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మంచి సినిమా చూడాలంటే…వెళితే థియేటర్‌కి వెళ్లాలి… లేదా ఏదో ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉండాలి. కానీ ఆ అవసరం లేకుండా.. రూపాయి ఖర్చు లేకుండా, ఉచితంగా.. అద్భుతమైన థ్రిల్లర్ సినిమాలను నిర్మాతలు యూట్యూబ్‌లో అందరికీ అందుబాటులో ఉంచారు.. వాటిలో తండ్రుల నాటి ఆస్తి వివాదాలు… తర్వాతి తరం మధ్య పగ, ప్రతీకారాలుగా మారితే ఏమవుతుంది? ఇదే పాయింట్‌తో సాగే ఉత్కంఠభరిత చిత్రం ‘తీర్పు’. 2022లో రిలీజైన ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్‌సుకుమారన్ నటించారు. కొందరు మిత్రుల తండ్రులు తమ ఆస్తిని అమ్మేందుకు ఒక విదేశీ మహిళతో కుదుర్చుకున్న డీల్ తీవ్ర వివాదాలకు దారితీస్తుంది. ఆ తగాదాలే తర్వాతి తరం ఒకరిపై ఒకరు రివెంజ్ తీర్చుకునే స్థాయికి తీసుకెళ్తాయి. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులతో సాగుతుంది.
సమాజంలో మురుగు కాలువలు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొనే దారుణ పరిస్థితుల నేపథ్యంలో 2022 తెరకెక్కిన పవర్ ఫుల్ కోర్ట్‌రూమ్ డ్రామా విట్నెస్. ఒక కార్మికుడు మ్యాన్హోల్లోకి దిగి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతాడు. అసలు అది ప్రమాదమా? లేక పక్కా పథకం ప్రకారం జరిగిన కుట్ర పూరిత హత్యనా? అనే కోణంలో సాగే విచారణ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. దీపక్ దర్శకత్వంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం సామాజిక స్పృహతో పాటు థ్రిల్లింగ్ ఫీలింగ్నందిస్తుంది..
Also Read
- Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
- Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
- Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
- Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
పక్కా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను కోరుకునే వారికి ‘చాప్రా మర్డర్ కేస్’ బెస్ట్ ఛాయిస్. 2024లో అంచక్కాల్లకొక్కన్ పేరుతో మలయాళంలో తెరకెక్కిన క్రైమ్ డ్రామా ఫిల్మ్. స్నేహితులతో కలిసి సరదాగా మద్యం సేవిస్తున్న ‘చాప్రా’ అనే వ్యక్తి దారుణ హత్యకు గురవుతాడు. ఈ హై ప్రొఫైల్ కేసును చేధించేందుకు వసుదేవ్ అనే పోలీస్ కానిస్టేబుల్ రంగంలోకి దిగుతాడు. అనుమానితుల చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్, హంతకుడిని పట్టుకునే క్రమంలో వచ్చే సీన్లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.
ఒక ఐపీఎస్ ఆఫీసర్ కథతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘పురు’. 2022లో తెరకెక్కిన ఈ సినిమా ‘కుట్టన్’ అనే ఐపీఎస్ ఆఫీసర్ తన కొడుకుని ఎంతో కఠినమైన క్రమశిక్షణతో పెంచుతుంటాడు. అంతా ప్రశాంతంగా సాగిపోతోందనుకున్న సమయంలో అతనిపై హత్యాయత్నం జరుగుతుంది. అసలు అతనికి ఉన్న అజ్ఞాత శత్రువులు ఎవరు? వారి నుంచి తన కొడుకుని, తనని ఎలా కాపాడుకున్నాడనేది ఈ చిత్ర కథాంశం.
చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తే ఓ అమాయకుడి పరిస్థితి ఏంటి? ఇదే కథాంశంతో రూపుదిద్దుకుంది ‘సోర్గవాసల్’. ‘ఈ సినిమా 2024లో జైలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఈ సినిమాలో ఆర్.జె. బాలాజీ, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు.1999 మద్రాస్ సెంట్రల్ జైలులో జరిగిన అల్లర్ల ఆధారంగా అన్యాయంగా శిక్షపడి జైలులో మగ్గిపోయిన ఒక వ్యక్తి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది..జైలు వాతావరణం అతడిని కూడా నేరస్తుడిగా మార్చిందా? లేక తన నిజాయతీతోనే ఆ నరకం నుంచి బయటపడ్డాడా అనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఇక చివరిగా కుటుంబ పోషణ కోసం కష్టపడే ‘రాజు’ అనే క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిరిగే కథను సోదర సోదరీమణులారా అనే పేరుతో తెలుగులో వచ్చిన ఎమోషనల్ డ్రామా. ఇక ఈ సినిమాను కథగా చెప్పాలంటే… ఒకరోజు రాత్రి ఎక్కువ డబ్బు ఆశ చూపి ఒక ప్యాసింజర్ అతని క్యాబ్ బుక్ చేసుకుంటాడు. అయితే, ఆ ఒక్క నైట్ ట్రిప్ అతని జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. ఆ ప్రయాణంలో ఎదురైన భయంకరమైన సంఘటనల నుంచి రాజు ఎలా ప్రాణాలతో బయటపడ్డాడనేది క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌గా సాగుతుంది. ఇందులో కమల్ కామరాజు, అపర్ణాదేవి, కాలకేయ ప్రభాకర్ మెయిన్ రోల్స్ చేసారు.
తాజావార్తలు
-
Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!