DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DC: లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రలలో నటించిన ‘డీసీ’ ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక టాపిక్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం లోకేష్‌కు బదులుగా ఒకప్పుడు విజయ్ దేవరకొండను దర్శకుడు సంప్రదించారనే ప్రచారం మొదలైంది. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఒకప్పుడు విజయ్ దేవరకొండను ఓ సినిమా కోసం సంప్రదించినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూ లో విజయ్ స్వయంగా వెల్లడించారు. అరుణ్ చెప్పిన కథ తనకు నచ్చిందని, అయితే అదే సమయంలో తాను చేస్తున్న మరో సినిమాతో ఆ కథలో కొన్ని పోలికలు ఉన్నట్లు అనిపించడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని ఆ ఇంటర్వ్యూ లో విజయ్ తెలిపారు.ఈ వివరాల ఆధారంగా ఆ ప్రాజెక్ట్ ‘డీసీ’ అయి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ కానీ, దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ కానీ ఇప్పటివరకు ధృవీకరించలేదు. అందువల్ల ప్రస్తుతం ఇది అభిమానుల్లో జరుగుతున్న చర్చగా మాత్రమే చూడాలి. ఒకవేళ నిజంగా ‘డీసీ’ కథనే విజయ్‌కు అప్పట్లో చెప్పి ఉంటే, ఈ సినిమా పూర్తిగా మరో రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేదనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆతరువాత ఈ సినిమాతో లోకేష్ కనగరాజ్ తొలిసారి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి సహ కథానాయికలుగా నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండ పేరు తెరపైకి రావడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి పెరుగుతోంది.
Also Read
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
- Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. 'రామాయణ' మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’లో ఆయన స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రష్మిక మందన్న ఆయనకు జోడీగా నటిస్తున్నారు. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే. తొలుత 2026 సెప్టెంబర్ 11న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతున్నట్లు సమాచారం. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. విజయ్ లైనప్‌లో ‘రౌడీ జనార్దన’ కూడా ఉంది. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 డిసెంబర్లో థియేటర్లలోకి రానుంది. మరోవైపు ‘హై నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో విజయ్ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తాత్కాలికంగా ‘VDxశౌర్యువ్’గా పిలుస్తున్న ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. మొత్తానికి ‘డీసీ’ కోసం విజయ్ దేవరకొండను సంప్రదించారా అనే ప్రశ్నకు ప్రస్తుతం అధికారిక సమాధానం లేకపోయినా, విజయ్ స్వయంగా గతంలో అరుణ్ మాతేశ్వరన్ తనను ఓ సినిమా కోసం సంప్రదించినట్లు చెప్పడం మాత్రం ఆసక్తికరమైన అంశంగా మారింది.
- Tags
- cinema
- Vijay Deverakonda
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!