టెస్లా ఆస్తులపై దాడులు చేస్తే ఖబడ్దార్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా టెస్లా ఆస్తులపై దాడుల చేస్తే 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల టెస్లా కార్ల షోరూమ్‌కి నిప్పుపెట్టారు. పలు కార్లు దగ్ధమయ్యాయి. ఇది ఉగ్ర చర్యగా టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఆరోపించారు. తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందిస్తూ.. టెస్లా ఆస్తులు ధ్వంసం చేసే వారికి 20 సంవత్సరాలు వరకు జైలు శిక్ష పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Karnataka: ముస్లిం కోటా బిల్లుకు ఆమోదం.. పేపర్లు చింపి స్పీకర్ ముఖం మీద కొట్టిన బీజేపీ ఎమ్మెల్యేలు
ప్రస్తుతం మస్క్… ట్రంప్ సలహాదారుడిగా ఉన్నారు. ఇటీవల టెస్లా కారును ట్రంప్ కొనుగోలు చేశారు. అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఇక ప్రభుత్వ నిర్ణయాల్లో మస్క్ పెత్తనంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులకు సంబంధించిన వాటిపై ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్రూత్ సోషల్‌లో స్పందిస్తూ.. టెస్లా ఆస్తులపై దాడులు చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దాడులు ప్రోత్సహించేవారికి కూడా అదే శిక్ష పడుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Mumbai: ఒకే బెంచ్‌పై కూర్చుని వడ పావ్ ఆస్వాదించిన బిల్‌గేట్స్-సచిన్
ప్రస్తుతం యూఎస్‌తో పాటు కెనడాలో కూడా టెస్లా ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. షోరూమ్‌లు, వాహన స్థలాలు, ఛార్జింగ్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.