Kash Patel: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నియామకాన్ని ప్రకటించారు. భారత మూలాలు ఉన్న కాష్ పటేల్‌ని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించారు. కాష్ పటేల్ ట్రంప్‌కి సన్నిహిత మిత్రుడు, మాజీ జాతీయ భద్రతా సహాయకుడు. ప్రస్తుతం చీఫ్ క్రిస్టోఫర్ వ్రే స్థానంలో కాష్ పటేల్ ఎఫ్‌బీఐ చీఫ్ కానున్నారు. ‘‘పటేల్ ఒక తెలివైన న్యాయవాది, పరిశోధకుడు మరియు 'అమెరికా ఫస్ట్' పోరాట యోధుడు, అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని రక్షించడం మరియు అమెరికన్…
అమెరికాలో అధ్యక్ష పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతారనే దానిపై యావత్ ప్రపంచం దృష్టి ఉంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్‌తో తలపడుతున్నారు. కాగా.. తాజాగా ఓ ఇంటర్య్వూలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కి ఓ ప్రశ్న అడిగారు. ట్రంప్ కమలా హారిస్‌లో ఎవరకు బెటర్.. భారత్‌కి ఎవరు మద్దతు తెలుపతారని ప్రశ్నించారు.
US President salary: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నవంబర్ 4న యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్ పోటీలో ఉన్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడి జీతం ఏడాదికి ఎంత ఉంటుంది..? ఏఏ సౌకర్యాటు ఉంటాయనే దానిపై అందరిలో ఆసక్తి ఉంటుంది.
తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువులపై పన్నులు విధిస్తానని ఆయన వెల్లడించారు. ఇక, అమెరికా నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై చైనా 200 శాతం సుంకం విధిస్తుంది.. బ్రెజిల్‌లో టారిఫ్‌లు కూడా అలాగే ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు అక్కడ నుంచే ఓటేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నిజానికి ఇలా ఓటు హక్కుని వినియోగించే అవకాశం ఉందా..? అంటే ఔననే సమాధానం వస్తుంది. వ్యోమగాములు 1997 నుంచి అంతరిక్షం నంచి ఓటేస్తున్నారు. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 1997లో టెక్సాస్ శాసనసభకు నాసా ఉద్యోగులు అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి అనుమతించే బిల్లుని ఆమోదించారు. అప్పటి నుంచి అంతరిక్షం…
Laura Loomer: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. డెమొక్రాటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్స్ తరుపున డొనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఒక పేరు మాత్రం అమెరికాలో విస్తృతంగా వినిపిస్తోంది. ‘‘లారా లూమర్’’ అనే 31 ఏళ్ల యువతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Astrologer: జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోటీపడబోతున్నారు.
అసలు నేను మీ ముందు ఇలా ఉండేవాడినే కాదు.. కాల్పుల ఘటనలో చనిపోయాననే అనుకున్నాను.. ఇదొక చిత్రమైన పరిస్థితి అని ట్రంప్ తెలిపారు. ఆ సమయంలో ఆయన చెవికి బ్యాండేజ్ ఉండటం గమనించొచ్చు.
Rahul Gandhi-Kamala Harris: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం ఫోన్లో మాట్లాడుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Vivek Ramaswamy: అయోవా స్టేట్ ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేస్తు్న ట్రంప్‌కి మొదటి విజయం దక్కింది. మరోవైపు ఇదే పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో రిపబ్లికన్ అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు రామస్వామి తెలిపారు.