Vishwak Sen: వైరల్ అయిన ఆ ట్వ్వీట్ ను డిలీట్ చేసిన విశ్వక్ సేన్..కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ రోజున మరిన్ని సినిమాలు పోటీలోకి రావటంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్‍పై కన్ఫ్యూషన్ ఏర్పడింది.. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 29) విశ్వక్‍సేన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ సంచలనం సృష్టించింది.. బ్యాక్‍గ్రౌండ్ లేకపోతే ప్రతీ ఒక్కరూ ఆడుకుంటారంటూ ఘాటైన వ్యాఖ్యలతో ఆ పోస్ట్ చేసాడు హీరో విశ్వక్ సేన్..ఒకవేళ డిసెంబర్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కాకపోతే.. ఆ సినిమా ప్రమోషన్లలో తాను కనపడబోనని తన పోస్టులో విశ్వక్‍సేన్ పేర్కొన్నాడు.
“బ్యాక్‍గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మన గేమ్ మారుద్దామనే అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా.. ప్రతీ ఫ్రేమ్ ప్రాణం పెట్టి చేసి చెబుతున్నా! డిసెంబర్ 8న కచ్చితంగా వస్తున్నాం.. హిట్, ప్లాఫ్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాఫ్.. మీ నిర్ణయమే. ఆవేశానికి లేదా ఈగోకి తీసకునే డెసిషన్ కాదు. తగ్గేకొద్ది తొక్కేస్తూనే ఉంటారని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లికి నా ఒట్టు.. ఒకవేళ డిసెంబర్ కాకపోతే ప్రమోషన్లలో నన్ను ఇక చూడరు” అని విశ్వక్‍సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.విశ్వక్‍సేన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది..ఎవరిని ఉద్దేశించి విశ్వక్ ఇలా అన్నారనే చర్చ సాగుతోంది. అయితే, పోస్ట్ చేసిన కొంత సమయానికి ఈ ట్వీట్‍ను డిలీట్ చేసి అందరికి ట్విస్ట్ ఇచ్చారు విశ్వక్. అయితే, విశ్వక్ చేసిన ఈ ట్వీట్.. ప్రమోషనల్ స్టంట్ అంటూ కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. నిజంగా కోపం తో పోస్ట్ చేసి ఉంటే.. డిలీట్ ఎందుకు చేసినట్టు అని ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై బజ్ నెలకొనేందుకు విశ్వక్ ఇలా చేశారని అనుమానిస్తున్నారు. అయితే, సినిమా వాయిదా పడుతుందనే బాధతోనే విశ్వక్ ఈ ట్వీట్ చేశారని మరికొందరు అతడికి మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు. విశ్వక్ చెప్పింది వాస్తవమేనంటూ కొంతమంది స్పందిస్తున్నారు.
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?