బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల అమెరికా పాలసీలు వ్యతిరేకిస్తున్న బ్రిక్స్ దేశాలకు అదనంగా మరో 10 శాతం సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్‌తో సంబంధాలు పెట్టుకున్న ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుందని.. మినహాయింపులు ఉండవని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌తో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు 10 శాతం అదనంగా సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2న ట్రంప్.. దేశాలపై సుంకాలు విధించారు. ఈ చర్యను బ్రిక్స్ దేశాలు ఖండించాయి.