ఇరాన్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
ఇరాన్‌కి మరోసారి అణు ఒప్పందం విషయంలో తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది అని.. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతారని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం విధించారు.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హమాస్-లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది.