UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections: 2027లో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న అయోధ్య అసెంబ్లీ స్థానానికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం అభ్యర్థిని ప్రకటించారు. అయోధ్య నుంచి పార్టీ పవన్ పాండేను బరిలో దింపబతోంది. లక్నోలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన బ్రహ్మణ సదస్సులో ఈ ప్రకటన వచ్చింది. పవన్ పాండే అయోధ్య నుంచి గెలవబోతున్నారని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు.
అయోధ్య అసెంబ్లీ సీటు రాజకీయంగా, మతపరంగా బీజేపీకి చాలా ప్రాధాన్యత కలిగినదిగా పరిగణించబడుతోంది. ఇక్కడి నుంచి ఎస్పీ తన అభ్యర్థిని రంగంలోకి దింపి సవాల్ విసిరింది. రామ మందిరం ఈ నియోజకవర్గంలోనే ఉంది. దీంతో ఈ ప్రకటన ద్వారా బీజేపీని ఎస్పీ సవాల్ చేసినట్లైంది. అయోధ్య జిల్లాలోని దరియాబాద్, రుదౌలి, మిల్కిపూర్, బికాపూర్ మరియు అయోధ్య అనే ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
పవన్ పాండే నేపథ్యం ఇదే..
విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన పవన్ పాండేను అయోధ్య బరిలో ఎస్పీ నిలిపింది. ముక్కుసూటి శైలి, దూకుడు రాజకీయ వైఖరి, ప్రజా సమస్యలపై గళం విప్పుతారనే పేరుంది. పవన్ పాండే 1998లో విద్యార్థి రాజకీయాల ద్వారా ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఈ సమయంలో, ఆయన సమాజ్‌వాదీ ఉద్యమ వ్యవస్థాపక నాయకుడైన ములాయం సింగ్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. 1999 నుంచి అఖిలేష్ యాదవ్‌కు సన్నిహితంగా ఉన్నారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత లల్లూ సింగ్‌ను ఓడించారు. ఇటీవల, శ్రీ రామ్ జన్మభూమి ఆలయంలోని కానుకలు, విరాళాల చుట్టూ ఉన్న వివాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని, ట్రస్ట్ పనితీరును సమీక్షించాలని, పారదర్శకతను నిర్ధారించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!