Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం
- హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్ముజ్‌పై ఇరాన్ సుంకాలు విధిస్తే.. మేమూ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్-ఒమన్‌ల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని.. రేపు లేదా ఎల్లుండి నాటికి జరగవచ్చని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నౌకల నుంచి సుంకాలు వసూలు చేయడాన్ని అనుమతించవద్దని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
జలమార్గాన్ని వెంటనే తిరిగి తెరవాలని, లేకపోతే తాను భారీ దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత జలమార్గం దానంతట అదే తిరిగి తెరుచుకుంటుందని అన్నారు. ఒకవైపు ఒప్పందంపై ఆశలు పెరుగుతుండగా… మరోవైపు ప్రాంతీయ జలమార్గాల్లో వాణిజ్య నౌకలపై దాడులు ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
కొత్త ఒప్పంద ప్రణాళిక ఏమిటి?
మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్-ఒమన్ మధ్య కొనసాగుతున్న చర్చల్లో భాగంగా ఒక కొత్త ఫార్ములా రూపుదిద్దుకుంటున్నట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు. దీని ప్రకారం.. నౌకలు ఇరాన్ నియంత్రణలో ఉన్న ఉత్తర మార్గం ద్వారా పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశిస్తాయి. తిరిగి వచ్చేటప్పుడు, అవి ఒమన్ నియంత్రణలో ఉన్న దక్షిణ మార్గాన్ని ఉపయోగిస్తాయి. సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఫలంగా.. నౌకల నుంచి సేవా రుసుము లేదా టోల్ వసూలు చేయవచ్చు. అయితే, ఈ మార్గంలో ఇరాన్ టోల్ వసూలు చేయడానికి తాను అనుమతించబోనని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా చర్చల్లో పురోగతిని ధృవీకరించారు.. కానీ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం లేదా పూర్తి ఒప్పందం కుదరలేదని తెలిపారు.
- Tags
- Hormuz
- Iran warning
- trump
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!