ప్రపంచం వ్యాప్తంగా ఆరు యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే చెబుతుంటారు. ఇదే క్రమంలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపానంటూ ట్రంప్ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు.
S Jaishankar: ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ రోజు మాట్లాడారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారనే విషయం స్పష్టంగా ఉందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య శాంతికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మేము పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదు. కాబట్టి పాక్ సైన్యం జోక్యం చేసుకోకుండా ఉండాలి. కానీ వారు ఆ…