US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Military: ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో అమెరికా అత్యాధునిక క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా భావించే అగ్రరాజ్యం అమెరికా వద్ద ఉన్న కొన్ని కీలక దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగం భారీగా పెరగడంతో ఆయుధ నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని నివేదిక పేర్కొంది. అయితే తమ వద్ద అవసరానికి మించిన ఆయుధాలు ఉన్నాయని, ఉత్పత్తిని కూడా వేగంగా పెంచుతున్నామని వైట్ హౌస్, పెంటగాన్ స్పష్టం చేస్తున్నాయి.
ఏ క్షిపణులపై ఎక్కువ ప్రభావం అంటే..
రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ (ATACMS), ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్ (PrSM) వంటి దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలు భారీగా వినియోగంలోకి వెళ్లాయి. PrSM కొత్త తరం క్షిపణి కావడంతో ప్రారంభం నుంచే వీటి సంఖ్య పరిమితంగానే ఉందని సమాచారం. ATACMS సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. PrSM ప్రారంభ వెర్షన్ 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండగా, భవిష్యత్ వెర్షన్లు మరింత ఎక్కువ దూరాన్ని చేరుకోనున్నాయి. అమెరికన్ థింక్ ట్యాంక్ సీఎస్ఐఎస్ (CSIS) అంచనాల ప్రకారం.. ATACMS, PrSM మాత్రమే కాకుండా పలు కీలక క్షిపణుల నిల్వలపై కూడా ఒత్తిడి పెరిగింది. పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ల నిల్వలు సుమారు 65 శాతం వరకు వినియోగంలోకి వెళ్లినట్లు, THAAD ఇంటర్సెప్టర్ల నిల్వలు సుమారు 38 శాతం తగ్గినట్లు అంచనా వేసింది. అలాగే టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్ల గ్లోబల్ స్టాక్‌లో సుమారు సగం వరకు వినియోగమైనట్లు పేర్కొంది. అయితే ఈ గణాంకాలను ధృవీకరించడం సాధ్యం కాలేదని రాయిటర్స్ స్పష్టం చేసింది.
Also Read
- Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
- Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
- Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
ఆందోళన ఎందుకు పెరుగుతోందంటే..
రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా ఒకేసారి పలు ప్రాంతాల్లో భద్రతా సవాళ్లను ఎదుర్కొంటే ఆధునిక క్షిపణుల లభ్యత కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఉద్రిక్తతలు లేదా ఇతర భద్రతా సంక్షోభాలు తలెత్తితే ఈ ఆయుధాలు అత్యంత కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న పేట్రియట్, ATACMS వంటి క్షిపణుల సరఫరాపై కూడా ఈ పరిస్థితి ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా నిల్వలు తగ్గితే భవిష్యత్ సైనిక సహాయంపై ప్రభావం పడే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. రక్షణ విశ్లేషకుల ప్రకారం.. పేట్రియట్, THAAD, టోమాహాక్ వంటి క్షిపణుల నిల్వలను తిరిగి భర్తీ చేయడానికి ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యంతో మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో రేథియాన్, పెంటగాన్ టోమాహాక్ ఉత్పత్తి పెంపుపై చర్యలు తీసుకుంటుండగా, లాక్‌హీడ్ మార్టిన్ ATACMS, PrSM, THAAD క్షిపణుల తయారీని వేగవంతం చేసే దిశగా పనిచేస్తోంది.
అయితే ఈ నివేదికలతో వైట్ హౌస్ పూర్తిగా ఏకీభవించడం లేదు. ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా అమెరికా వద్ద అత్యధిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఎప్పుడైనా సైనిక చర్యలు చేపట్టేందుకు తమ వద్ద తగినంత సామర్థ్యం ఉందని పెంటగాన్ అధికార ప్రతినిధి షాన్ పార్నెల్ తెలిపారు. క్షిపణుల ఉత్పత్తి గతంతో పోలిస్తే ప్రస్తుతం రికార్డు స్థాయిలో కొనసాగుతోందని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.
తాజావార్తలు
-
Yash Thakur Duck out: ఒక్క పరుగు చేయకుండానే.. 16 ఏళ్ల తర్వాత ధోనీ, సచిన్, కోహ్లీల సరసన యశ్ ఠాకూర్..!
-
Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
-
Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
-
IND vs PAK U19: ‘ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’.. టీమిండియా త్రిల్లింగ్ విక్టరీపై వైభవ్ పోస్ట్ వైరల్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
ట్రెండింగ్
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?