North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- హీట్‌వేవ్ నేపథ్యంలో కుక్క మాంసం సూప్ తాగాలని ఉత్తర కొరియా సూచన.
- శరీరానికి బలం, వడదెబ్బ నివారణకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ మీడియా వాదన.
- ఆరోగ్య ప్రయోజనాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణుల అభిప్రాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: చిత్ర విచిత్రమైన రూల్స్‌లో ప్రపంచంలోనే ఉత్తరకొరియా టాప్‌లో ఉంటుంది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే అక్కడ న్యాయం. ఆయన మాటలను కాదని ఎదురిస్తే దారుణమైన చావే గతి. ఇలాంటి దేశంలో ఇప్పుడు కొత్త ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. మండే ఎండలతో పోరాడుతున్న ఉత్తర కొరియాలో ‘‘కుక్క మాంసం’’ సూప్ తాగమని అక్కడి ప్రజలకు ప్రభుత్వం సలహా ఇస్తోంది. బలాన్ని అందించి, వడదెబ్బను నివారించడంలో ఇది సహాయపడుతుందని ఉత్తరకొరియన్ల నమ్మకం.
డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాలో వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్‌ను మించిపోయాయి. కొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వార్తాపత్రిక, ఒక సీనియన్ వైద్యుడితో జరిగిన ఇంటర్వ్యూలో ప్రజలు కుక్క సూప్ తాగాలని సలహా ఇచ్చింది. కొరియన్ భాషలో ‘‘డాంగోగి గుక్’’ అని పిలువబడే వంటకం ఉంటుంది. దీనికి ‘‘తీపి మాంసం సూప్’’ అనే అర్థం వస్తుంది. ఈ సూప్ అత్యంత పోషకమైనదని, మండుటెండలో శరీరానికి శక్తిని అందిస్తుందని, మరియు వడదెబ్బను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని ప్రభుత్వ ఆధీనంలోని వార్తాపత్రిక పేర్కొంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రయోజనకరమని, అలాగే మధుమేహం, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని ఆ నివేదిక పేర్కొంది.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
కుక్క సూప్ పురుషుల్లో శారీరక బలాన్ని పెంచుతుందని, శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని ఒక నమ్మకం ఉంది. అయితే, దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేవు. రాజధాని ప్యాంగ్యాంగ్లో కేవలం కుక్క మాంసంతో తయారు చేసే సూప్ ను అందించే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఈ వంటకాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇష్టపడుతారని చెబుతారు. ప్రభుత్వ విందుల్లో, హైలెవల్ పార్టీల్లో దీనిని వడ్డిస్తారు.
తాజావార్తలు
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..