Gaza-Israel: గాజాలో మళ్లీ టెన్షన్ వాతావరణం.. తాజా దాడుల్లో 26 మంది మృతి
- గాజాలో మళ్లీ టెన్షన్ వాతావరణం
- తాజా దాడుల్లో 26 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాలో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ఒక వారం పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో మళ్లీ బాంబులు మోతతో దద్దరిల్లింది. ఇటీవల ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ప్రస్తుతం అంతా కూల్‌గా ఉందనుకున్న సమయంలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి.
ఇది కూడా చదవండి: PAK vs AFG: కాల్పుల విరమణకు ఒప్పుకున్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్..
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
శాంతి ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 26 మంది చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. నుసెయిరాట్ ప్రాంతంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై జరిగిన దాడిలో చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళ, బిడ్డ ఉన్నట్లు పేర్కొన్నారు.
హమాస్ ఉగ్రవాదులు.. తమ దళాలపై విధ్వంసక క్షిపణిని ప్రయోగించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. తమ దళాలపై జరిపిన దాడుల తర్వాత ఎన్‌క్లేవ్ అంతటా హమాస్ లక్ష్యాలను, ఫీల్డ్ కమాండర్లు, గన్‌మెన్‌లు, ఒక సొరంగం, ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Off The Record: సొంత మైలేజ్ కోసం ఎమ్మెల్యేలను నాగబాబు దూరం పెడుతున్నారా ?
ప్రస్తుతం గాజా-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉందని ట్రంప్ తెలిపారు. ఏం జరిగిందో అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారని.. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగేలా చూస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ జరిపిన దాడులు సమర్థనీయమో కాదో తనకు తెలియదన్నారు.
అమెరికా ఒత్తిడి మేరకు గాజాకు సహాయం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు తెలిపాయి. కానీ ఇంతలోనే దాడులు మళ్లీ షురూ అయ్యాయి. అయితే హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని బహిరంగంగా ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సరఫరాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ కొద్దిసేపటికే ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 26 మంది చనిపోయారు.
రెండేళ్ల తర్వాత అక్టోబర్ 10న ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఇరు పక్షాలు కూడా శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. హమాస్ ఉగ్రవాదులు బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. కానీ కొద్దిరోజులకే మళ్లీ పరిస్థితులు మొదటికొచ్చాయి.
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!