గాజాలో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ఒక వారం పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో మళ్లీ బాంబులు మోతతో దద్దరిల్లింది. ఇటీవల ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ప్రస్తుతం అంతా కూల్‌గా ఉందనుకున్న సమయంలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి.