గాజాలో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ఒక వారం పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో మళ్లీ బాంబులు మోతతో దద్దరిల్లింది. ఇటీవల ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ప్రస్తుతం అంతా కూల్‌గా ఉందనుకున్న సమయంలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి.
నేపాల్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో భద్రతా దళాలు-నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది నిరసనకారులు చనిపోయారు. ఇక కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నిరసనలకు దిగొచ్చి... సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తేసింది.