శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. అక్కడ రాష్ట్రపతి వర్సెస్ ప్రధాన మంత్రి తరహాలో రాజకీయం నడుస్తోంది. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితిని చక్కదిద్దేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక సర్కార్ ఏర్పాటుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారని.. శ్రీలంక ఫ్రీడం పార్టీ అధినేత, ఎంపీ మైత్రిపాల సిరసేన మీడియాకు తెలిపారు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంటుందని, కేబినెట్‌లో సుమారు 20 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధాని మహీంద రాజపక్స ఉండబోరని చెప్పారు.
ప్రధానికి 117 మంది ఎంపీల మద్దతు ఉంది. కానీ శుక్రవారం నాటికి శ్రీలంకలో రాజకీయ పరిణామాలు మారిపోయినట్టు తెలుస్తోంది. మైత్రిపాల సిరిసేన నేతృత్వంలోని అసమ్మతి వాదుల ప్రతినిధి బృందం.. కొలంబోలోని భారత హై కమిషనర్ గోపాల్ బాగ్లేతో భేటీ అయింది. దేశంలోని తాజా పరిస్థితిని వివరించింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.
ఇదిలా వుంటే అన్నయ్య వర్స్ తమ్ముడి పొలిటికల్ వార్ తారస్థాయికి చేరింది. అఖిలపక్ష సర్కార్ ఏర్పాటుకు లంక అధ్యక్షుడు గోటబోయో రాజపక్షే నిర్ణయించినా ఎట్టిపరిస్థితిలోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న ప్రధాని మహేంద్ర రాజపక్సే ప్రకటించడం కీలకం మారింది. ఈ నేపథ్యంలో 11 పార్టీలతో కోత్త ప్రభుత్వం, కొత్త ప్రధాన మంత్రి, కొత్త కేబినెట్ రావడంపై సందిగ్దత నెలకొంది. తన వర్గం ఎంపీల కీలకసమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు మహేంద్ర రాజపక్సే. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలీని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు అక్కడి ప్రజలు. ఇక.. దేశంలో సంక్షోభంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజపక్స కుటుంబం తమ పదవుల నుంచి తక్షణం వైదొలగాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
Minister KTR: ఎవరినీ బాధపెట్టాలని అలా మాట్లాడలేదు