Pakistan Takes Cost-Cutting Measures To Address Financial Emergency: దాయాది దేశం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మరో శ్రీలంకలా తయారయ్యేందుకు సిద్ధంగా ఉంది పాకిస్తాన్. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు పాక్ సర్కార్ నానా కష్టాలు పడుతోంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. ప్రభుత్వ వాహనాలకు ఇంధనాన్ని రేషన్ ఇవ్వడంతో పాటు అధికారిక ప్రయాణాలపై ఆంక్షలు విధించబోతోంది. లీవ్ క్యాష్ మెంట్ నిలిపివేయడంతో పాటు మెడికల్ బిల్లల…
శ్రీలంకలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్ మరింత పెరుగుతోంది. ఎమర్జెన్సీ కారణంగా మరింతగా పరిస్థితులు దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ధరలపై పెరుగుతున్న ఆందోళనలను అణచివేయడం కోసం దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎమర్జెన్సీ శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వచ్చిందని ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు మరోసారి ఎమర్జెన్సీని ప్రకటించామన్నారు. గోటబయ రాజీనామా చేయాలని డిమాండ్లు…
శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. అక్కడ రాష్ట్రపతి వర్సెస్ ప్రధాన మంత్రి తరహాలో రాజకీయం నడుస్తోంది. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితిని చక్కదిద్దేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక సర్కార్ ఏర్పాటుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారని.. శ్రీలంక ఫ్రీడం పార్టీ అధినేత, ఎంపీ మైత్రిపాల సిరసేన మీడియాకు తెలిపారు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంటుందని, కేబినెట్‌లో సుమారు 20 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. తాత్కాలిక…
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వున్న శ్రీలంకలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్న రాత్రి జరిగిన అత్యవసర సమావేశం అనంతరం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాని నిర్ణయంపై ఆసక్తిగా మారింది శ్రీలంక రాజకీయం. రాజీనామా చేసిన వారిలో ప్రధాన మంత్రి మహీందా రాజపక్సే కుమారుడు క్రీడా శాఖమంత్రి నమల్ రాజపక్సే కూడా వున్నారు. శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు కూడా వుంటారు. రాజకీయ సుస్థిరతను కొనసాగించేందుకు కొత్త తాత్కాలిక…