Minister KTR: ఎవరినీ బాధపెట్టాలని అలా మాట్లాడలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. జగన్ సోదర సమానుడు.. ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అన్నారు కేటీఆర్. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రం లో కరెంటు ఉండడం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో గత రాత్రి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన వ్యాఖ్యల వెనక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఏపీలోని తన స్నేహితులను తెలియకుండానే తన వ్యాఖ్యలతో కొంత బాధ పెట్టి ఉండొచ్చన్నారు.
అయితే, ఎవరినో కించపరచాలనో, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, అన్యాపదేశంగానే అవి తన నోటి వెంట వచ్చాయని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను తన సోదరుడిగా భావిస్తానని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు కేటీఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై జగన్ మంత్రివర్గంలోని మంత్రులు కూడా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
It appears that an innocuous comment that I had made at a meeting earlier today may have caused some unintentional pain to my friends in AP
I enjoy a great brotherly equation with AP CM Jagan Garu & wish that the state prospers under his leadership
— KTR (@KTRTRS) April 29, 2022
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఏపీకి వచ్చి అభినందిస్తున్నారు.. కానీ, కేటీఆర్ ఎవరి మహర్బానీ కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని కౌంటర్ ఇచ్చారు.. కేటీఆర్ ఆ రకంగా మాట్లాడకూడదన్న ఆయన.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్నారు…ఇచ్చారా? నాలుగు చినుకులు పడగానే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది.. డ్రగ్స్ కేసులు ఏ రకంగా హైదరాబాద్‌లో ఉన్నాయో అందరికీ తెలుసు.. ఇలాంటివి చెబితే చాలా ఉంటాయన్నారు కారుమూరి నాగేశ్వరరావు. మరో మంత్రి రోజా కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీ గురించి కేటీఆర్ మాట్లాడలేదు అనుకుంటున్నా.. పొరుగు రాష్ట్రం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కాదు అనుకుంటానన్నారు.
Minister Karumuri: కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్కు రెడీ?.. గీక్బెంచ్లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!