చారిత్రకంగా చూస్తే శ్రీలంక పేరు ప్రస్తావన రామాయణం, మహాభారతంలలోనూ ఉంది. అయితే ప్రస్తుతం ఆ దేశం పరిస్థితికి కారణం ఎవరని పరిశీలిస్తే మహాభారతంలో పేర్కొన్న దుష్ట చతుష్టయం లాంటి ‘ఆ నలుగురు’ కనిపిస్తారు. ఏపీలో నిన్నే ముగిసిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో కూడా దుష్టచతుష్టయం అనే అంశంపై నేతలు విరివిగా ప్రసంగించటం గమనార్హం. అదే సమయంలో అటు శ్రీలంక ప్రజలు తమ దేశ అధ్యక్షుడి నివాసాన్ని ఆక్రమించారు. అయితే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అప్పటికే పరారయ్యారు. పాలకుడంటే ప్రజలను…
శ్రీలంకలో దారుణపరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తూనే వున్నారు. కొలంబోలోని పార్లమెంటు భవనం ముందు అండర్ వేర్లతో ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరలు సామాన్యుడికి అందడం లేదు. ఎప్పుడూ లేనివిధంగా ధరలు అంతరిక్షాన్ని తాకాయి. దేశం దివాలా అంచున నిలిచింది. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ప్రజలు, విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు…
శ్రీలంకలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్ మరింత పెరుగుతోంది. ఎమర్జెన్సీ కారణంగా మరింతగా పరిస్థితులు దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ధరలపై పెరుగుతున్న ఆందోళనలను అణచివేయడం కోసం దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎమర్జెన్సీ శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వచ్చిందని ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు మరోసారి ఎమర్జెన్సీని ప్రకటించామన్నారు. గోటబయ రాజీనామా చేయాలని డిమాండ్లు…
శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. అక్కడ రాష్ట్రపతి వర్సెస్ ప్రధాన మంత్రి తరహాలో రాజకీయం నడుస్తోంది. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితిని చక్కదిద్దేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక సర్కార్ ఏర్పాటుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారని.. శ్రీలంక ఫ్రీడం పార్టీ అధినేత, ఎంపీ మైత్రిపాల సిరసేన మీడియాకు తెలిపారు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంటుందని, కేబినెట్‌లో సుమారు 20 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. తాత్కాలిక…