Lawrence Wong replace Lee Hsien Loong as Singapore PM: మే 15న సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సింగపూర్‌కు దాదాపు 20 ఏళ్లుగా పీఎంగా ఉన్న లీ సీన్ లూంగ్ ఆ బాధ్యతలు వీడనున్నారు. మే 15న ప్రధానమంత్రి పదవి నుంచి తాను దిగిపోనున్నట్లు లూంగ్ సోమవారం సోషల్ మీడియాలో ప్రకటించారు. లూంగ్ స్థానాన్ని ఉప ప్రధాని అయిన లారెన్స్ వాంగ్‌తో భర్తీ చేయనున్నట్లు సింగపూర్ ప్రధానమంత్రి కార్యాలయం…
PM Modi : లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రాలకు కోట్ల విలువైన బహుమతులు ఇస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోడీని ఈసారి ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో విపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి ఇండియా. ఈ కూటమికి సంబంధించి ప్రధాని అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే అందులో ఉన్న పార్టీల నేతలందరు మాత్రం ఐకమత్యంగా ఉండటం చాలా అవసరమని ఆ మాటపై కట్టుబడి ఉన్నారు. ఇక ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించకపోవడంతో ప్రతి పార్టీకి చెందిన నేతలు తమ నాయకుడే ప్రధాని అభ్యర్థికి సమర్థుడు అంటూ ప్రకటిస్తున్నారు. Also Read: Suryakumar Yadav Sixes: కెమరూన్…
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. పాట్నా యూనివర్సిటీలో సన్మాన కార్యక్రమానికి నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. 'దేశ ప్రధాని ఎలా ఉండాలి, నితీష్ కుమార్ లా ఉండాలి' అంటూ కొందరు విద్యార్థులు నినాదాలు చేశారు.
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. పేద, ధనవంతులు, అధికారం, హోదాలు అడ్డుకాదని నిరూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపింది. ప్రధానితో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ముందుగా ప్రధాని జెసిండాకు కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్ కు కరోనా…
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్…
ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. గ్యాస్, పెట్రోల్ దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితులు మధ్య ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి తమ ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏకంగా అధ్యక్షుడు రాజపక్సే నివాసానికి దగ్గర్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామాలను డిమాండ్ చేస్తున్నారు శ్రీలంక ప్రజలు. తాజాగా ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని…
శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. అక్కడ రాష్ట్రపతి వర్సెస్ ప్రధాన మంత్రి తరహాలో రాజకీయం నడుస్తోంది. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితిని చక్కదిద్దేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక సర్కార్ ఏర్పాటుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారని.. శ్రీలంక ఫ్రీడం పార్టీ అధినేత, ఎంపీ మైత్రిపాల సిరసేన మీడియాకు తెలిపారు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంటుందని, కేబినెట్‌లో సుమారు 20 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. తాత్కాలిక…