శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. అక్కడ రాష్ట్రపతి వర్సెస్ ప్రధాన మంత్రి తరహాలో రాజకీయం నడుస్తోంది. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితిని చక్కదిద్దేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక సర్కార్ ఏర్పాటుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారని.. శ్రీలంక ఫ్రీడం పార్టీ అధినేత, ఎంపీ మైత్రిపాల సిరసేన మీడియాకు తెలిపారు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంటుందని, కేబినెట్‌లో సుమారు 20 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. తాత్కాలిక…