Saudi Crown Prince Mohammed Bin Salman defers Pakistan trip: పీకల్లోతు ఆర్థిక కష్టాలు, రాజకీయ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. అక్కడి ఆర్థిక పరిస్థితి మరో శ్రీలంకలా తయారైంది. ద్రవ్యల్భనం పెరిగింది. దీనికి తోడు ఇటీవల వచ్చిన వరదలు పాకిస్తాన్ ను మరింతగా నష్టపరిచాయి. భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లింది. దీంతో తమకు సాయం చేయాలని పాక్ ప్రపంచ దేశాలను కోరుతోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయం శనివారం ధృవీకరించింది.
Read Also: Iran: హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నందుకు తొలి మరణశిక్ష విధించిన ఇరాన్
గత నెలలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. త్వరలోనే సౌదీ యువరాజు పాకిస్తాన్‌ను సందర్శిస్తారని మరియు చమురు శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిపెడతారని వెల్లడించారు. దీంతో పాటు దేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సహాయం చేస్తారని చెప్పారు. అయితే ఉన్నట్టుండి సౌదీ ప్రిన్స్ పర్యటన వాయిదా పడింది. 2019లో చివరిసారిగా మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ లో పర్యటించారు.
జీ 20 సమావేశాలు పూర్తి అయిన తర్వాత నవంబర్ 21న సౌదీ ప్రిన్స్ పాకిస్తాన్ పర్యటన చేపట్టాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంతో పాటు ఇండియాతో సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ కు పిలుపు ఇవ్వడంతో మళ్లీ రాజకీయంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ నెల మొదట్లో ఇమ్రాన్ ఖాన్ పై ఓ దుండగుడు కాల్పులు జరిగాయి. గాయపడిన ఆయన మళ్లీ తన లాంగ్ మార్చ్ కంటిన్యూ చేస్తానని పిలుపు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే సౌదీ ప్రిన్స్ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.