India Pakistan: ఎట్టకేలకు పాకిస్తాన్ క్రమంగా నిజాలను ఒప్పుకుంటోంది. తమపై భారత్ దాడి చేయలేదని, దాడి జరిగినా, పాకిస్తాన్ ఆర్మీ తిప్పికొట్టింది అంటూ విజయోత్సవాలు చేసుకున్న ఆ దేశ నేతలు నిజాలను వెల్లడిస్తున్నారు. తాజాగా, తమపై భారత్ క్షిపణులతో దాడులు చేసిందని, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. మే 10 తెల్లవారుజామున భారత్ బాలిస్టిక్ క్షిపణులతో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు ఇతర ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిందిన ఆయన బహిరంగంగా ప్రకటించారు.
Pakistan: ‘‘ఆపరేషన్ సింధూర్’’ దెబ్బ పాకిస్తాన్‌కి బాగా తగినట్లు ఉంది. అయితే, ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మాత్రం భారత్ దాడి వల్ల నష్టపోయామని ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, తన ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌గా భారత్ తగిన గుణపాఠం చెప్పింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ఉగ్రవాదుల్ని, దాని మద్దతుదారుల్ని భారత సైన్యం హడలెత్తించింది. పీఓకే, పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లో 09 ఉగ్ర స్థావరాలపై భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక్కసారిగా భారత్ విరుచుకుపడటంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రజల్ని ఉద్దేశించి జాతీయ అసెంబ్లీలో…
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, బుధవారం తెల్లవారుజాము ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఒక్కసారిగా పాకిస్తాన్ షాక్‌కి గురైంది. ఇదిలా ఉంటే, ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు.
Shehbaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రటించుకున్నారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్ ప్రయేయాన్ని భారత దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్‌పై భారీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దౌత్య చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
Pakistan: 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే దౌత్యపరంగా భారత్ పాకిస్తాన్‌కి షాక్‌లు ఇస్తోంది. పాక్ ప్రాణాధారమైన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసి, దేశంలో ఉంటున్న పాకిస్థానీలను వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌పై చర్యల విషయంలో భారత త్రివిధ దళాలకు ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. టైమ్,…
Pakistan: మొహర్రం పండగ సందర్భంగా పాకిస్తాన్ సోషల్ మీడియాపై బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతోంది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్ బ్యాన్‌పై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన రాజకీయ సలహాదారు లాహోర్‌లో కిడ్నాప్‌కి గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసినట్లు ఈ రోజు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.
Pakistan: పాకిస్తాన్‌లోని ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంత్రివర్గంలో బిలావల్ భుట్టో కీలక పదవి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన బిలావల్ భుట్టో మరోసారి ఇదే పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా కొత్తగా ఎన్నికైన షాబాజ్ షరీఫ్.. తన మొదటి విదేశీ పర్యటనకు వెళ్లారు. నవాజ్, ఇమ్రాన్‌ల బాటలోనే తొలి విదేశీ పర్యటనకు సౌదీ అరేబియాను ఎంచుకున్నాడు. అయితే.. కశ్మీర్ సమస్యకు సంబంధించి సౌదీ అరేబియా షాబాజ్‌కి భారీ షాకిచ్చింది. కశ్మీర్ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. న్యూఢిల్లీతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ పాకిస్థాన్ ప్రధానికి సూచించారు.