రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈస్టర్ సందర్భంగా కాల్పులకు విరామం ప్రకటించి సంచలనం సృష్టించారు. తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌తో నేరుగా శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా పుతిన్ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. తాజా ప్రకటనతో రష్యా అధ్యక్షుడిలో మార్పు కనిపిస్తుందని ప్రపంచ నేతలు భావిస్తున్నారు. ఇక యుద్ధం ప్రారంభం అయ్యాక.. ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Inter Results: అలర్ట్.. నేడే ఇంటర్ ఫలితాలు… ఎన్ని గంటలకంటే?
ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడయ్యాక రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా అధికారులు చర్చలు జరిపారు. అంతేకాకుండా నేరుగా ట్రంప్-పుతిన్‌కి ఫోన్ చేసి కూడా మాట్లాడారు. ఇంత చేసినా ఏ మాత్రం సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో విసుగు చెందిన అమెరికా.. ఇటీవల ఈ మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ట్రంప్‌నకు వేరే పనులు చాలా ఉన్నాయని.. ఇక బ్రోకర్ పనుల నుంచి తప్పుకోబోతున్నట్లు వెల్లడించింది. అమెరికా హెచ్చరికలతో మొత్తానికి పుతిన్ ఇన్నాళ్లుకు దిగొచ్చారు. మార్పునకు కారణమేంటో తెలియదు గానీ.. ప్రత్యక్షంగానే ఉక్రెయిన్‌తో చర్చలు జరుపుతామని ప్రకటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: Ram Pothineni : హీరో రామ్ తో డేటింగ్.. స్పందించిన భాగ్య శ్రీ..
మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతోంది. శాంతి చర్చలకు ట్రంప్ శ్రీకారం చుట్టినా పుతిన్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం రష్యన్ ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈస్టర్ సందర్భంగా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించారు. ఒక్కరోజు గడిచిన తర్వాత పుతిన్ నోటి నుంచి శాంతి చర్చల ప్రస్తావన రావడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అమెరికాతో కలిసి శాంతి చర్చలు జరుపుతామని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sampath Nandi : అందుకే అక్కడ ఫస్ట్ నైట్ సీన్లు పెడుతా.. సంపత్ నంది క్రేజీ ఆన్సర్