Sampath Nandi : డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా మారి తీసిన మూవీ ఓదెల-2. ప్రస్తుతం థియేటర్లో ఆడుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో సంపత్ నంది మూవీ విశేషాలను పంచుకున్నారు. డైరెక్టర్ అశోక్ తేజ ఈ మూవీని బాగా తీశాడన్నారు. తమన్నా నాగసాధువు పాత్రకు తగిన న్యాయం చేసిందంటూ ప్రశంసించారు. అయితే ‘మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు అన్నీ పొలాల దగ్గరే ఎందుకు పెడతారు.. మీకేమైనా పర్సనల్ ఎక్స్ పీరియన్స్ ఉందా’ అని ఓ రిపోర్టర్ షాకింగ్ ప్రశ్న వేశాడు. దానికి సంపత్ నంది కూడా ఆశ్చర్యపోయాడు. తనకు అలాంటి ఎక్స్ పీరియన్స్ ఏమీ లేదని నవ్వుతూ చెప్పాడు.
Read Also : Hyderabad: ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..
‘ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కటి ఫేమస్. మా ప్రాంతంలో పొలాల దగ్గర మంచెలు చాలా బాగుంటాయి. పొలాల దగ్గర మంచెల మీద కూర్చుని ఉంటే ఆ ఆనందం వేరు. వాటిని గుర్తు చేసే ఉద్దేశంతోనే అలా పెట్టానేమో అనిపిస్తుంది. అంతే తప్ప అందులో ప్రత్యేకించి వేరే ఉద్దేశం లేదు. చాలా రోజుల తర్వాత మంచెలపై ఫస్ట్ నైట్ సీన్ పెడితే కొత్తగా ఉంటుందనే తాట్ వచ్చింది. అందుకే ఇలా పెట్టాం’ అంటూ చెప్పుకొచ్చాడు సంపత్ నంది. ఇక ఓదెల-2 ఇంకా బ్రేక్ ఈవెన్ పూర్తి చేయలేదు. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ కు దగ్గర్లో ఉన్నాయి కలెక్షన్లు. ఆ మూవీకి మూడో పార్టును కూడా తీస్తామని క్లారిటీ ఇచ్చేశారు. అయితే కపాల మోక్షం జరిగింది తిరుపతికి కాదేమో అన్న హింట్ ఇచ్చారు డైరెక్టర్ సంపత్ నంది.