పోప్ ఫ్రాన్సిస్(88)కు చెందిన తాజా ఫొటోను వాటికన్ విడుదల చేసింది. ఆస్పత్రిలో ఉన్న ఫొటోను ఆదివారం విడుదల చేసింది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఫిబ్రవరి 14న రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన బాహ్య ప్రపంచానికి కనబడలేదు. తాజాగా పోప్‌కు సంబంధించిన ఫొటో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే వైద్యులు.. పలు రకాలైన టెస్టులు నిర్వహించారు. అనంతరం న్యుమోనియాకు డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వాటికన్ తెలిపింది. ఇది కూడా చదవండి:…
Pneumonia : కాథలిక్ క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం కాస్త నలతగా ఉందని సమాచారం. 87 ఏళ్ల పోప్ ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రిలో చేరారు.
పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యం ఇంకా సంక్లిష్టంగానే ఉన్నట్లుగా వాటికన్ సిటీ తెలిపింది. గత శుక్రవారం శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూనే ఉన్నారు. మరి కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని వాటికన్ పేర్కొంది.
పోప్ ఫ్రాన్సిస్ వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. చాలా రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలుమార్లు కిందపడి పోవడంతో గాయాల పాలయ్యారు.
పోప్ ఫ్రాన్సిస్ భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తెలిపారు. శనివారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ చేత కార్డినల్‌గా ఆర్చ్‌బిషప్ జార్జ్ జాకబ్ కూవకాడ్‌కు పట్టాభిషేకం జరగనుంది.
ఇటలీలో జీ 7 సదస్సు ఆద్యంతం ఉత్సాహంగా సాగుతోంది. అగ్ర నేతలంతా ఒక దగ్గరకు చేరడంతో సమ్మిట్ అంతా ఉల్లాసంగా నడుస్తోంది. ఒక ఆహ్వాదకరమైన వాతావరణంలో కొనసాగుతోంది.
ఇటలీలో జరుగుతున్న జీ 7 సమ్మిట్ ఆద్యంతం సందడి.. సందడిగా సాగుతోంది. అగ్ర నేతలంతా ఇటలీలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా సాగుతున్నారు. ఇక ప్రధాని మోడీ.. ఆయా దేశాధినేతలతో సమావేశం అయ్యారు.
పోప్ ఫ్రాన్సిస్‌కు అరుదైన అవకాశం దక్కింది. జీ 7 నాయకులను ఉద్దేశించి ప్రసంగించే ఛాన్స్ దక్కింది. జీ 7 సదస్సులో మాట్లాడిన మొదటి కాథలిక్ చర్చి అధిపతిగా పోప్ ఫ్రాన్సిస్ నిలుస్తున్నారు.
ఇటలీలో పడిపోతున్న జనాభాపూ పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటాలియన్లు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని కోరారు. దేశ జనాభా సంక్షోభం భవిష్యత్తుకు ముప్పు అని ఆయన హెచ్చరించారు. కుటుంబాలకు సహాయం చేయడానికి దీర్ఘకాలిక విధానాలకు పోప్ పిలుపునిచ్చారు. ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ పిల్లలు, యువత లేని దేశానికి భవిష్యత్తు లేదన్నారు. ఇటలీలో జననాల రేటు ఇప్పటికే చాలా తక్కువగా ఉందని.. 15 సంవత్సరాలుగా నిరంతరం పడిపోతోందని…