రెండు రోజుల క్రితం టెహ్రాన్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ గురువారం ఇరాన్‌లోని సిస్తాన్-ఓ-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసింది. ఇస్లామాబాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇస్లామాబాద్‌లోని ఒక ప్రకటనలో, పాకిస్తాన్ భద్రతా దళాలు సమన్వయంతో , నిర్దిష్ట లక్ష్యంగా ఖచ్చితమైన సైనిక దాడులను నిర్వహించాయని పేర్కొంది.
Pakistan attacks Iran: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ దాడి చేసిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ ఇరాన్‌పై ప్రతీకార దాడులకు పాల్పడింది. గురువారం రోజు ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై పాకిస్తాన్ దాడులు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిజరేషన్ ఆర్మీ వేర్పాటువాద గ్రూపుల పోస్టులపై పాకిస్తాన్ దాడులు చేసినట్లు సమాచారం.