పాకిస్థాన్ అంతర్గత అంశాలు ఎలా ఉన్నారు.. ఇప్పుడు ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.. భారత్‌తో పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చింది.. దీనికోసం ప్రత్యేకంగా ఓ మంత్రిని కూడా నియమించింది పాకిస్థాన్. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్‌కు ఇదో ఊరట అని విశ్లేషిస్తున్నారు.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో, భారత్‌తో వాణిజ్యాన్ని పునఃప్రారంభించే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇక, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కమర్ జమర్ కైరాను వాణిజ్య మంత్రిగా నియమించారు.
Read Also: Telangana: సీడబ్ల్యూసీకి తెలంగాణ లేఖ.. ఆ రెండు ప్రాజెక్టులపై ఫిర్యాదు..
అంతే కాదు.. తమ దేశాలతో వాణిజ్య సంబంధాలు మరియు ఒప్పందాలను మెరుగుపరచుకోవడానికి కనీసం 15 దేశాలలో ఇలాంటి వాణిజ్య అధికారులు మరియు మంత్రులను నియమించింది పాక్.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను మార్చిన తర్వాత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశంతో వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే, ప్రస్తుత నిర్ణయంపై విశ్లేషకులు మరియు ప్రజల నుండి కూడా తీవ్ర విమర్శలకు ఎదురవుతున్నాయి.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్థాన్ ప్రయోజనాలకు రాజీపడిందని, కాశ్మీర్ ప్రజల ఆశలను దెబ్బతీసిందని ఆరోపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్యం దిశగా ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే ఏ చర్య అయినా కాశ్మీరీల అమ్మకం మాత్రమే కాదు, భారత ఆధిపత్యానికి మృదువైన లొంగుబాటుకు నాంది అవుతుందని సీనియర్ జర్నలిస్ట్ మరియు విశ్లేషకుడు నజీమ్ జెహ్రా పేర్కొన్నారు.