ఇది షహబాజ్ను పుతిన్ అవమానించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో కూడా ఆయన ఇలాగే అవమాన పడ్డారు.
Shahbaz Sharif: తుర్క్మెనిస్తాన్ వేదికగా జరుగున్న ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఉన్నారు. సుమారు 40 నిమిషాలు వేచి చూసినా కూడా పుతిన్ పట్టించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన షహబాజ్ షరీఫ్ దౌత్యంపరంగా సిగ్గులేని పని చేశాడు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు భారత్ అపూర్వ స్వాగతం పలికింది. ప్రధాని నరేంద్రమోడీ నేరుగా వెళ్లి ఎయిర్‌పోర్టులో పుతిన్‌ను రిసీవ్ చేసుకున్నారు. రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి.
Pakistan: పాకిస్తాన్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీ చీప్ అసిమ్ మునీర్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్)గా నియమించింది. ఇటీవల పాకిస్తాన్ రాజ్యాంగంలో 27వ రాజ్యాంగ సవరణ చేసి, అసిమ్ మునీర్‌కు సీడీఎఫ్ రూపంలో అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రభుత్వానికి సమాంతర వ్యక్తిగా, ఒక విధంగా చెప్పాలంటే పౌర ప్రభుత్వం కన్నా మిన్నగా ఆయన అధికారాలు ఉంటున్నాయి. ఈ సీడీఎఫ్ పదవిలో మునీర్ 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. Read…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ ఇటీవల ఆ దేశంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరిని అనుమతించకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లతో సహా, ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎంను కూడా అధికారులు…
Donald Trump: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌పై భారీ దాడులు నిర్వహించింది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు దిగడంతో పాక్ వైమానిక దళానికి చెందిన 10 ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.
Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించారు. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న వానాలోని క్యాడెట్ కాలేజీపై సోమవారం దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ రెండు దాడులు ‘‘భారత స్పాన్సర్ ఉగ్రవాద ప్రాక్సీ దాడులు’’ అని నిందించారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు భారత్ ఉగ్రవాదాన్ని నిర్వహిస్తుందని ఫరీఫ్ మంగళవారం అన్నారు. భారతదేశ…
Pakistan: పాకిస్తాన్లో బయటకే ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఏం చెప్పినా, ప్రభుత్వం తలాడించాల్సిందే. లేదంటే సైనిక తిరుగుబాట్లు తప్పవు. పాకిస్తాన్ ఎన్నో సార్లు సైనిక తిరుగుబాట్లను చూసింది. ఇప్పుడు, నాలుగో సారి ఆ దేశంలో ‘‘ఆసిమ్ మునీర్’’ రూపంలో తిరుగుబాటు జరుగున్నట్లు కనిపిస్తోంది.
Pakistan: పాకిస్థాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను పాక్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కాదని ఓ పాకిస్థాన్ సినియర్ అధికారి అన్నారు. "పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించిన మొదటి దేశం కాదు.. అలాగే అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కూడా కాబోదు." అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి వాదనను అబద్ధాలకోరుగా తోసిపుచ్చారు. కాగా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్,…
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీకి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఆఫ్ఘానిస్తాన్‌తో శత్రుత్వం విషయంలో పాక్ ప్రభుత్వాన్ని కాదని ఆసిమ్ మునీర్ వ్యవరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడుల కోసం పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగిస్తోందని ఇటీవల తేలింది.