ఎవరైనా ఉద్యోగులు ఉద్యోగం నుంచి నిష్క్రమిస్తున్నట్లు కంపెనీకి లేఖ లేదా ఇమెయిల్ రాజీనామా లేఖను పంపిస్తారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ రాజీనామా లేఖ చాలా మంది హృదయాలను తాకింది. ఓ వ్యక్తి తన రాజీనామాను ఇమెయిల్ లేదా కాగితంపై కాదు, టాయిలెట్ పేపర్‌పై రాసింది. అలా రాయడానికి గల కారణం అవసరానికి ఉపయోగించే టాయిలెట్ పేపర్ లాగా కంపెనీ నన్ను వాడుకుంది. అవసరమైనప్పుడు వాడటం, ఆ తర్వాత రెండో ఆలోచన లేకుండా తీసివేయడం.. అందుకే కంపెనీకి ఇలా బుద్ధి చెప్పాలనుకున్నాను అని తెలిపింది.
Also Read:Nara Lokesh: ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు సన్మానం.. హ్యాట్సాఫ్..! మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా..!!
సింగపూర్ వ్యాపారవేత్త ఏంజెలా యోహ్ తన ఉద్యోగి రాజీనామా లేఖను చూసి ఆశ్చర్యపోయింది!దీన్ని ఇటీవల లింక్డ్ఇన్‌లో పంచుకున్నారు. ఇది కాస్త నెట్టింటా వైరల్ గా మారింది. రాజీనామా టాయిలెట్ పేపర్‌పై రాసినందున మాత్రమే కాదు, అందులో లోతైన వేదన ఉంది కాబట్టి అది వైరల్ అయింది. తనను మనిషిగా కంటే ‘పని యంత్రం’గా భావించిన ప్రతి వ్యక్తి అనుభవించే బాధ అది. ఆ ఉద్యోగిని ఇలా రాసుకొచ్చింది.. ” ఈ కంపెనీ నాతో ఇలా వ్యవహరించింది కాబట్టి నేను రాజీనామా చేయడానికి టాయిలెట్ పేపర్‌ను ఎంచుకున్నాను. నేను రాజీనామా చేస్తున్నాను.” అయితే, ఇది నిజమైన రాజీనామానా లేక కేవలం సింబాలిక్ కోసమా అన్నది ఏంజెలా స్పష్టం చేయలేదు.
Also Read:PBKS vs KKR: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఏంజెలా తన పోస్ట్‌లో ఇలా రాసింది..”మీ ఉద్యోగులను అభినందించండి. వారు మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు కోపంగా కాకుండా కృతజ్ఞతతో వెళ్తారని చెప్పింది. ఎవరైనా కృతజ్ఞతతో వెళ్లిపోతే అది కంపెనీ గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తుంది. సంస్థ ఉన్నతికి పాటుపడిన ఉద్యోగులకు తగిన గౌరవం ఇవ్వాలని తెలిపింది. ఈ రాజీనామా లేఖపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాము.. కానీ బయటికి చెప్పే ధైర్యం లేదు అని ఒకరు కామెంట్ చేశారు. కొన్నిసార్లు ఉద్యోగులు కంపెనీ వల్ల కాదు, మేనేజర్ వైఖరి వల్ల వెళ్లిపోతారని కామెంట్ చేశారు.