దేశ భద్రతను, సంపదను రక్షించేందుకు భారత రక్షణ దళాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. అధునాతన ఆయుదాలను త్రివిధ దళాలు సమకూర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ మహే యుద్ధనౌకను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన మహే శ్రేణిలో ఇది మొదటిది. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనిని స్వావలంబన భారత్ శక్తిగా అభివర్ణించారు. ఈ నౌక శత్రు జలాంతర్గాములను గుర్తించి నాశనం చేస్తుంది.…
Indian Military: భారత సైన్యం మరింత ఆధిపత్యాన్ని చూపబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చే విధంగా భారత సైన్యానికి రూ. 79,000 కోట్లతో రక్షణ పరికరాల కొనుగోళ్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ‘‘డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్’’ ఆమోదం తెలిపింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్‌ను దాడులు ఆపేయాలని కోరకుంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, మే నెలలో భారత్ పాకిస్తాన్‌లో ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. నాలుగు రోజుల ఈ సైనిక ఘర్షణ తర్వాత, పాకిస్తాన్ బ్రతిమిలాడటంతో భారత్ సైనిక చర్యను నిలిపేసింది.
Defence Department : దేశాన్ని కాపాడటంలో రక్షణశాఖ ఎంత కీలకం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రక్షణశాఖకు సంబంధించిన ఫొటోలు గానీ వీడియోలు గానీ బయట పెడితే కఠిన చర్యలు తీసుకుంటాయి ప్రభుత్వాలు. అలాంటిది అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి రక్షణశాఖకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఏకంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంకు చెందిన బి రవి(36) ఐటిఐ పూర్తి చేసి డాక్ యార్డ్ షిప్…
Indian Navy Submarines: భారత్ ఎప్పటికప్పుడు తన రక్షణ శక్తులను పెంచుకుంటూ పోతుంది. ఇందులో భాగంగానే తాజాగా భారత నౌకాదళం మరింత బలపడేందుకు మరో పెద్ద అడుగు వేయబోతోంది. అతి త్వరలో 9 ఆధునిక డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరిన్లు నౌకాదళంలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటి ధరలపై చర్చలు జరుగుతుండగా, తర్వాత మంత్రివర్గ భద్రతా కమిటీ (CCS) నుంచి ఆమోదం లభించనుంది. ఈ సబ్‌మెరిన్లు మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో నిర్మించబడతాయి. AFG vs PAK: ఛేదనలో బొక్కబోర్లా…
Defence Forces In KBC 17: కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17కి హోస్ట్‌గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ వ్యవహరిస్తున్నారు. అయితే, త్వరలో ప్రసారం కానున్న స్వాతంత్య్ర దినోత్సవ రోజుకు సంబంధించి ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోలో ఆయన దేశ రక్షక వీరులైన భారత రక్షణ దళాల ప్రతినిధులతో కలిసి ముచ్చటించారు.
Bitra island: భారతదేశం తన వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ త్రివిధ దళాలను మోహరిస్తోంది. ముఖ్యంగా, భారత నేవీ కోసం అనేక కొత్త ఏర్పాట్లను చేస్తోంది. ఉద్రిక్త సమయంలో చైనాకు సరకు రవాణా కట్ చేసేలా, మలక్కా జలసంధిని కంట్రోల్ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. Read Also: Honeymoon: హనీమూన్ కోసం…
Indigenous Anti Submarine: భారత నౌకాదళానికి సంబంధించి భారీ విజయంగా నిలిచే మరో అడుగు ముందుకువేసింది. పూర్తి స్థాయిలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ-సబ్‌మేరిన్ రాకెట్ (ERASR) ను విజయవంతంగా పరీక్షించామని అధికారికంగా ప్రకటించారు. జూన్ 23 నుండి జూలై 7 వరకు యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరట్టి నుంచి ఈ ప్రయోగాలు నిర్వహించబడ్డాయి. Read Also:ATM Robbery: జీడిమెట్లలో రెచ్చిపోయిన దొంగలు.. గంటలో మూడు ATMలు కొల్లగొట్టిన కేటుగాళ్లు..! ఈ పరీక్షల విజయంపై…
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వైమానిక దళం, పాకిస్తాన్‌కి చుక్కలు చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్న నేరానికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి, 100 కు పైగా ఉగ్రవాదుల్ని భారత్ హతమార్చింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలతో పాటు దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని క్షిపణులను ఉపయోగించి భారత్ ధ్వంసం చేసింది. Read Also: DRI: పాకిస్థాన్‌కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ…
భారత నావికాదళం త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం, స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ (MCMVs) ను పొందే అవకాశం ఉంది. నీటి అడుగున దాగి ఉన్న శత్రువుల ల్యాండ్మైన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగిన 12 నౌకలను రూ.44,000 కోట్ల వ్యయంతో తయారు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.