Mohsen Fakhrizadeh: ఇజ్రాయిల్ ఆపరేషన్ ఎలా ఉంటాయో చూడాలంటే, తాజాగా ఇరాన్ దాడులే నిదర్శనం. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని వారి బెడ్రూంలోకి దూరి మరీ చంపేస్తోంది. వీరిలో పాటు కీలకమైన మిలిటరీ జనరల్స్‌ని అత్యంత ఖచ్చితత్వంతో హతమార్చింది. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది.
హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తు్న్న ఇజ్రాయెల్ గురువారం మరో చరిత్ర సృష్టించింది. అగ్ర నాయకులందరినీ ఐడీఎఫ్ దళాలు అంతమొందించాయి. అయితే గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి సూత్రదారి యాహ్యా సిన్వార్ మాత్రం చేతికి చిక్కలేదు. అతగాడి కోసం ఐడీఎఫ్ దళాలు ఎంత వెతికినా దొరకలేదు.
ఇద్దరు బందీలను కాపాడేందుకు దక్షిణ గాజాలోని రఫా సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 63 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ విషయాన్ని రఫా ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు.