Expensive Cities: సాధారణంగా ప్రజలు విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు. విలాసవంతమైన భవనాల్లో ఉండాలని.. ఖరీదైన వస్తువులు వాడాలని భావిస్తుంటారు. ఏ బాదర బందీ లేకుండా విలాసంగా జీవితం సాగిపోతే బాగుంటుందని భావించే వారు ఎక్కువ మంది ఉంటారు. ఇక తాము విలాసవంతమైన భవనాల్లో ఉండలేకపోయితే.. కనీసం విలాసవంతమైన భవనాలను చూడాలనుకునే వారు ఉంటారు. మరికొందరు విలాసవంతమైన నగరాలను చూసి రావాలనుకునే వారు ఉంటారు. అటువంటిదే ఈ వార్త. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే నివాస యోగ్యానికి అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క నగరం నిలిచింది. హాంగ్‌కాంగ్ 2వ స్థానంలో ఉండగా.. జెనీవా మరియు లండన్ 3, 4 స్థానాలను సొంతం చేసుకున్నాయి. సింగపూర్ 5వ స్థానంలో నిలిచింది.
Read also: Vande Bharat Train: త్వరలో రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్.. రామగుండంలో స్టేషన్
గత ఏడాది(2022) 2వ స్థానంలో ఉన్న న్యూయార్క్ నగరం మొదటి స్థానంలో హాంకాంగ్‌ను పక్కకు నెట్టి ఈ ఏడాది(2023) ప్రపంచంలోనే అత్యంత నివాసానికి ఖరీదైన నగరంగా ఆవిర్భవించింది. ఈసీఏ ఇంర్నేషనల్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ ఫర్ 2023 సర్వేను నిర్వహించింది. ఇందులో పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న వసతి ఖర్చులు 2023 కొరకు ECA ఇంటర్నేషనల్ యొక్క జీవన వ్యయ ర్యాంకింగ్స్‌లో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉండటానికి కారణాలుగా పేర్కొనబడ్డాయి. ఆకాశాన్నంటుతున్న అద్దెల కారణంగా సింగపూర్ మొదటి ఐదు స్థానాల్లోకి ప్రవేశించినట్లు కొత్త అధ్యయనం తెలిపింది. జెనీవా మరియు లండన్ మూడవ మరియు నాల్గవ స్థానాల్లో కొనసాగుతున్నాయి. సింగపూర్ గతేడాది 13వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 13 నుంచి టాప్-5గా అవతరించింది. ఆసియా నగరాల ర్యాంకులు పడిపోవడానికి ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువ ద్రవ్యోల్బణం రేట్లు కారణంగా చెప్పబడ్డాయి. ఆగ్నేయాసియా ఫైనాన్షియల్ హబ్ యొక్క పెరుగుదల కారణంగా వసతి ఖర్చులలో పెద్ద పెరుగుదల ఉందని సర్వే నిర్వహించిన ECA ఇంటర్నేషనల్ ఆసియా రీజినల్ డైరెక్టర్ చెప్పారు.
నివేదిక ప్రకారం, ఇస్తాంబుల్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ యొక్క ఆర్థిక విధానాల కారణంగా ధరలలో 80 శాతం పెరుగుదల నేపథ్యంలో ఇస్తాంబుల్ నగరం 95 స్థానాలు ఎగబాకి 108వ స్థానానికి చేరుకుంది. రష్యన్ ప్రవాసుల ప్రవాహంతో దుబాయ్‌లో అద్దెలు దాదాపు మూడింట ఒక వంతు పెరిగాయి దీంతో 12వ స్థానానికి చేరుకుంది. చాలా యూరోపియన్ నగరాలు ర్యాంకింగ్స్‌లో మెరుగుపడ్డాయి. నార్వేజియన్ మరియు స్వీడిష్ నగరాలు ఆయా దేశాల్లో కరెన్సీ విలువ తగ్గడంతో ర్యాంకింగ్స్ లో పడిపోయాయి. అలాగే ఫ్రెంచ్ నగరాలు తక్కువ ద్రవ్యోల్బణం రేటుతో పడిపోయాయి. యూరోపియన్ యూనియన్‌తో పోలిస్తే చైనా నగరాలు బలహీన కరెన్సీ మరియు తక్కువ ద్రవ్యోల్బణం ప్రభావం కారణంగా ర్యాంకింగ్స్‌లో పడిపోయాయి.
Read also: NBK 108: టైటిల్ రివీల్ కే గాల్లోకి లేపుతున్నారుగా?
ప్రవాసులు నివసించడానికి ప్రపంచంలోని టాప్-20లోని అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
1. న్యూయార్క్, యుఎస్
2. హాంగ్ కాంగ్, చైనా
3. జెనీవా, స్విట్జర్లాండ్
4. లండన్, యుకె
5. సింగపూర్
6. జ్యూరిచ్, స్విట్జర్లాండ్
7. శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్
8. టెల్ అవీవ్, ఇజ్రాయెల్
9. సియోల్, దక్షిణ కొరియా
10. టోక్యో, జపాన్
11. బెర్న్, స్విట్జర్లాండ్
12. దుబాయ్, యుఎఇ
13. షాంఘై, చైనా
14. గ్వాంగ్‌జౌ, చైనా
15. లాస్ ఏంజిల్స్, యుఎస్
16. షెన్‌జెన్, చైనా
17, బీజింగ్, చైనా
18. కోపెన్‌హాగన్, డెన్మార్క్
19. అబుదాబి, యుఎఇ
20. చికాగో, యుఎస్