NBK 108: టైటిల్ రివీల్ కే గాల్లోకి లేపుతున్నారుగా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బజ్ స్టార్ట్ అయిపొయింది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ లో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీలా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుండగా,బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ ఇరగదీస్తాడని సమాచారం. అన్న ఈసారి తెలంగాణలో దిగుతుండు అంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే క్లియర్ గా చెప్పేసాడు కాబట్టి బాలయ్య డైలాగ్స్ ఏ రేంజులో పేలతాయో చూడాలి. ఈ దసరాకి ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయిన NBK 108 సినిమా ప్రమోషన్స్ ని గ్రాండ్ స్కేల్ లో మొదలుపెట్టడానికి మేకర్స్ రెడీ అయ్యారు. జూన్ 10న బాలయ్య బర్త్ డే కావడంతో NBK 108 నుంచి ఫాన్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేసిన చిత్ర యూనిట్, బాలయ్య పుట్టిన రోజు కన్నా రెండు రోజుల ముందే తెలుగు రాష్ట్రాల్లో హంగామా చేయనున్నారు.
బాలయ్య నటిస్తున్న 108వ సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో 108 చోట్ల సినిమా టైటిల్ ని రివీల్ చేస్తూ హోర్డింగ్స్ పెట్టడానికి సిద్ధమయ్యారు. దాదాపు అన్ని సిటీస్ అండ్ టౌన్స్ లో NBK 108 రివీల్ హోర్డింగ్స్ కనిపించనున్నాయి. ప్రొడ్యూసర్స్ టైటిల్ అనౌన్స్మెంట్ కే ఈ రేంజ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు అంటే అభిమానుల్లో NBK 108 సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారెంటీ. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, NBK 108 సినిమాకి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ని ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టాగ్ లైన్ ని ఫైనల్ చేసారని సమాచారం. మరి ఈ టైటిల్ నే అనిల్ రావిపూడి కూడా ఫిక్స్ చేశాడా లేక మరో కొత్త టైటిల్ తో నందమూరి అభిమానులకి స్వీట్ షాక్ ఇస్తాడా అనేది చూడాలి.
Also Read
Let the celebrations kick off in a MASSIVE WAY😎#NBK108 Title Launch TOMORROW with 108 Hoardings across AP/TS 🔥
Stay Tuned💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna pic.twitter.com/nPdXll06vI
— Shine Screens (@Shine_Screens) June 7, 2023
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
-
Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Vipperla TDP Clash : పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్‌తో మహిళ హల్చల్.. విప్పర్లలో టీడీపీ వర్గపోరు!
-
Arjun Sarja: నా కూతురి జోలికొస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫైర్!
-
CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!