Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌గా భారత్ తగిన గుణపాఠం చెప్పింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ఉగ్రవాదుల్ని, దాని మద్దతుదారుల్ని భారత సైన్యం హడలెత్తించింది. పీఓకే, పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లో 09 ఉగ్ర స్థావరాలపై భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక్కసారిగా భారత్ విరుచుకుపడటంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది.
ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రజల్ని ఉద్దేశించి జాతీయ అసెంబ్లీలో బుధవారం మాట్లాడారు. భారత దాడిని పిరికి చర్యగా అభివర్ణించారు. భారత సైన్యం దాడికి పాక్ సైన్యం తగిన జవాబు ఇచ్చిందని యథావిధిగా మరోసారి పాకిస్తాన్ అబద్ధాలను ప్రచారం చేసింది. భారత్ పూర్తి సన్నద్ధతతో 80 విమనాలతో దాడి చేసిందని పాక్ ప్రధాని ఆరోపించారు. భారత్ విమానాలు పాకిస్తాన్‌పై దాడి చేస్తాయని మాకు ముందు నుంచి సమాచారం అందుతోందని, భారత్ ఇటీవల ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ విమానాలు కొనుగోలు ఒప్పందాన్ని కూడా షహబాజ్ షరీఫ్ ప్రస్తావించారు.
Read Also: Indo-Pak: బార్డర్‌లో పాక్ ఆర్మీ విచక్షణారహిత కాల్పులు.. 15 మంది భారతీయ పౌరులు మృతి!
భారత్ ఎలాంటి ఆధారాలు లేకుండా పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్‌ని నిందించారని, దేవుడిని తప్పా ఈ సంఘటనలో పాక్ ప్రమేయం ఉందని ప్రపంచాన్ని నమ్మించేందుకు భారత్ ప్రయత్నించిందని అన్నారు. భారత దాడికి ప్రతీకారం తీర్చుకునే హక్కు పాకిస్తాన్‌కి ఉందని అన్నారు. రెండు నెలల క్రితం బలూచిస్తాన్‌లో జరిగిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్‌లో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నయని పాక్ ప్రధాని చెప్పారు.
భారత క్షిపణి దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పాక్ ప్రధాని మరోసారి అబద్ధాలను ప్రచారం చేశారు. దీనికి ప్రతిస్పందనగా పాక్ వైమానిక దళం భారత10 విమానాలను కూల్చివేసిందని అన్నారు. పాకిస్తాన్ సాయుధ దళాలు భారతదేశానికి తగిన జవాబు ఇచ్చాయని, చీకటి రాత్రిని మెరుపు రాత్రిగా మార్చాయని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.