Pakistan:ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో పాకిస్తాన్ సతమతం అవుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు అధిక ధరలు, కొందాం అనుకున్నా నిత్యవసరాలు అందుబాటులో ఉండటం లేదు. దీనికి తోడు కరెంట్, ఇంధన సమస్యలతో పాక్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి షషహాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ను ఎలాగైనా అదుపు చేయాలని భావిస్తోంది.
Read Also: OPEC Plus: సౌదీ అరేబియా నిర్ణయంతో భారత్కు గట్టి ఎదురుదెబ్బ.. పెట్రోల్ ధరలు ఇక తగ్గనట్లే
ఇదిలా ఉంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు నరేంద్ర మోడీ కంటే ఇమ్రాన్ ఖాన్ తోనే ఎక్కువ ప్రమాదం అని ఆయన అన్నారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీ విదేశీ శత్రువు గురించి మీకు తెలుసు కానీ పాకిస్తాన్ లో పుట్టిన ఇమ్రాన్ ఖాన్, భారత్ కన్నా పెద్ద ముప్పుగా మారుతుండటాన్ని ప్రజలు గుర్తించలేకపోతున్నారని. నరేంద్ర మోడీ కన్నా ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కు ప్రమాదకరమని, దీన్ని ప్రజలు చూడలేకపోతున్నారని ఆసిఫ్ అన్నారు.
మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా భారీగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. వీటిని తిరుబాటుగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుకు సంబంధించి మే 9న ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను సాయుధ పారామిలటరీ బలగాలు అరెస్టు చేయడంతో పాకిస్థాన్‌లో మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులు ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని, టాప్ కమాండర్ల నివాసాలను ముట్టడించారు, వాహనాలను తగలబెట్టడానికి, జాతీయ రహదారిని అడ్డుకోవడానికి మరియు దేశ భద్రతా దళాలపై దాడి చేయడానికి వీధుల్లోకి వచ్చారు.
Unbelievable. Defense Minister of Pakistan @KhawajaMAsif declared @ImranKhanPTI a bigger threat to the security of Pakistan than Indian Prime Minsiter @narendramodi. pic.twitter.com/XzEnlhYRc6
— Hamid Mir حامد میر (@HamidMirPAK) June 1, 2023