Pakistan: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల సరిహద్దు వెంబడి తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. మంగళవారం పాక్ దళాలు, ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 15 మంది సాధారణ పౌరులు చనిపోయినట్లు ఆఫ్ఘాన్ తాలిబాన్ అధికారులు చెప్పారు.
Arab-Islamic Summit: ఇటీవల హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఖతార్ రాజధాని దోహాపై విరుచుకుపడింది. హమాస్ నేతలు సమావేశమైనట్లు భావిస్తున్న భవనంపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలను అసలు ఖతార్ ఊహించలేదు. ఈ దాడుల్ని పిరికిదాడులుగా అభివర్ణించింది. ఈ దాడులు, గాజాలో ఇజ్రాయిల్ దాడుల తీవ్రత పెంచిన తర్వాత అరబ్-ఇస్లామిక్ నేతల సమాశానికి దోహా వేదికైంది. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన ఇస్లామిక్ దేశాల అధినేతలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద కామెంట్స్…
మొస్సాద్.. ఇజ్రాయెల్ అత్యంత శక్తివంతమైన నిఘా వ్యవస్థ. గురి పెట్టిందంటే పని కావాల్సిందే. అంత పగడ్బందీగా పని చేయగల సామర్థ్యం మొస్సాద్ సొంతం. అలాంటిది మొట్టమొదటిసారిగా ఖతార్‌లో విఫలమైంది. దీనికి అంతర్గత విభేదాలే కారణంగా ది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది.
Israel: 9/11 దాడుల తర్వాత అమెరికా ఏం చేసింది, తాము కూడా అదే చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాపై అమెరికా స్పందించినట్లే తాము ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ పొలిటికల్ బ్యూరోపై దాడులు చేశామని సమర్థించుకున్నారు. ఖతార్, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న ఇతర దేశాల వారిని బహిష్కరించాలని లేదా వారిని న్యాయం ముందు నిలబెట్టాలని ఆయన అన్నారు. ‘‘మీరు అలా చేయకుంటే మేము చేస్తాం’’ అని నెతన్యాహూ అన్నారు. అంతర్జాతీయంగా…
PM Modi: హమాస్ పొలిటకల్ బ్యూరో నాయకులే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులను ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. దాడిపై విచారం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆందోళన తెలియజేశారు. తాను ఈ విషయమై ఖతాన్ ఎమిర్‌తో మాట్లాడానని, ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించానని, వివాదాలు పరిష్కరించుకోవడానికి చర్చించుకోవాలని పిలుపునిచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు. Read Also: CPL 2025 Robbery: తుపాకీతో బెదిరించి.. ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు!…
హమాస్ నాయకులే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్ మెరుపుదాడులకు దిగింది. వరుస పేలుళ్లతో దోహా దద్దరిల్లింది. వైమానిక దాడుల్లో మంటలు చెలరేగాయి. నివాస భవనాల నుంచి మంటలు చెరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
PAK Beggars: తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారని.. మూడేళ్ల క్రితం ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించాడు. ఆయన అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ.. దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు భయ పెడుతున్నారు.
Qatar PM: ఖతార్ నుండి అమెరికాకు ఇచ్చే లగ్జరీ జెట్ విమానం బహుమతి వివాదంపై ఆ దేశ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ స్పందించారు. ఇది వ్యక్తిగతంగా ట్రంప్‌కు ఇచ్చే బహుమతిగా కాకుండా, ప్రభుత్వ స్థాయిలో జరిగిన లావాదేవిగా ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మిడిల్ ఈస్ట్ పర్యటనలో భాగంగా ఖతార్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా ఖతార్ అమెరికాకు లగ్జరీ విమానం అందించనున్నట్లు వార్తలు…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్ రాజ కుటుంబం విలాసవంతమైన బోయింగ్ 747-8 జెట్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విమానం విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు(దాదాపు 3,300 కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ విమానం తాత్కాలికంగా ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించబడే అవకాశం ఉంది. 2029లో ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసిన తర్వాత, ఈ విమానం ట్రంప్ అధ్యక్ష గ్రంథాలయ ఫౌండేషన్‌కు బహుమతిగా ఇవ్వబడనుంది. ఇక ఈ బహుమతి విషయాన్ని…
Tech Mahindra: ఖతార్‌లో గుజరాత్‌కి చెందిన భారతీయ ఉద్యోగి అమిత్ గుప్తా అరెస్ట్ రెండు దేశాల మధ్య దౌత్య వివాదంగా మారింది. ఈ అరెస్ట్ క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా జరిగినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. డేటా చౌర్యం కేసులో ఈ అరెస్ట్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. టెక్ మహీంద్రా ఖతార్ విభాగానికి అమిత్ గుప్తా సీనియర్ ఉద్యోగిగా ఉన్నారు.