Sunil Chhetri Retirement: భారత్ ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్ జట్టుకు వెన్నముఖగా ఉన్న సునీల్ ఛెత్రి.. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో కువైట్‌తో మ్యాచ్ తనకు చివరిదని ఇప్పటికే ప్రకటించిన భారత కెప్టెన్ ఛెత్రి ఇప్పుడు వీడ్కోలు పలికాడు. గురువారం భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ 0-0తో డ్రా అయింది. తన చివరి మ్యాచ్‌లో భారత జట్టును గెలిపించడానికి ఛెత్రి తీవ్రంగా శ్రమించాడు. అయితే…
ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో స్పెయిన్ స్పెయిన్ జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 0-1 తేడాతో గెలిచి మొట్టమొదటి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Sports Sponsorships: మన దేశ క్రీడా రంగానికి 2022వ సంవత్సరం మరపురాని ఏడాదిగా మిగిలిపోయింది.. విజయాల పరంగా కాదు.. వ్యాపారం పరంగా. ఎందుకంటే.. గతేడాది.. స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌లు ఏకంగా 49 శాతం వృద్ధి చెందాయి. తద్వారా 14 వేల 209 కోట్ల రూపాయలకు చేరాయి. పోయినేడాది పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగటమే ఇందుకు కారణం.
Pele Death: ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే (82) మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సావో పాలోలోని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలే బ్రెజిల్‌కు మూడుసార్లు ప్రపంచకప్ అందించారు. 1958, 1962, 1970లలో ఫిఫా ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలిపించిన ఏకైక ఆటగాడు పీలే. ఆయన బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ…
FIFA World Cup: ఖతార్ వేదికగా ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విజేతగా నిలిచింది. దీంతో ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కల కూడా నెరవేరింది. అర్జెంటీనా విజయం సాధించడంతో ప్రపంచంలోని పలు దేశాల్లో ఫుట్‌బాల్ అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇందులో మన ఇండియాలోని కేరళ కూడా ఉంది. కేరళలో ఫుట్‌బాల్‌కు క్రేజ్ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్న శింబు అనే వ్యక్తి ఈ ఏడాది…
ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. టైటిల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం వచ్చిన అభిమానులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను పోలిన వ్యక్తి కనిపించాడు.
మేఘాలయలోని షిల్లాంగ్ జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ఎనిమిదేళ్ల ఈశాన్య భారత్‌లో అభివృద్ధికి అడ్డుగా నిలిచిన అవినీతి, అశాంతి, రాజకీయ అనుకూలత వంటి అన్ని అడ్డంకులకు తమ ప్రభుత్వం రెడ్ కార్డ్ ఇచ్చిందన్నారు.
FIFA Rejects Ukrainian President Zelensky's Peace Message: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచులు జరగుతున్నాయి. ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును తన శాంతి సందేశం కోసం వేదిక చేసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్స్కీ భావించాడు. అయితే ఇందుకు ఫిఫా నిర్వాహకుల నో చెప్పినట్లు తెలిసింది. ఫైనల్ మ్యాచుకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించాలని జెలన్స్కీ…