China: ట్రంప్‌తో పాటు మా పాత్ర కూడా ఉంది.. భారత్-పాక్ వార్ విరమణపై చైనా కొత్త రాగం
- ఆపరేషన్ సిందూర్‌పై చైనా కొత్త రాగం
- శాంతి ఒప్పందంలో తమ పాత్ర కూడా ఉందని వ్యాఖ్య
- ఇప్పటికే ట్రంప్ వాదనను తోసిపుచ్చిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము కూడా ‘‘శాంతికాముకులం’’ అంటూ డ్రాగన్ దేశం చైనా కూడా కొత్త రాగం అందుకుంది. ట్రంప్‌తో పాటు చైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు ఆపిందని.. శాంతి చర్చల్లో పాల్గొందంటూ కొత్త పలుకు పలికింది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం మే 7న ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల తర్వాత మే 10న ఇరు దేశాల చర్చలతో కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ క్రెడిట్‌ను ట్రంప్ కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇరు దేశాలను వాణిజ్య హెచ్చరికలతో బెదిరించడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. అయితే ట్రంప్ వాదనను భారతదేశం తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. అయినా కూడా ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కడికెళ్లినా.. ఏ నేతతో భేటీ అయినా ప్రపంచ వ్యాప్తంగా భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాటు ఎనిమిది యుద్ధాలు ఆపినట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకోవైపు భారత్ నిరంతరం ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇలా ఇప్పటి వరకు 70 సార్లు ఆ విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు.
Also Read
- Tragedy: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
- Bangladesh: బంగ్లాదేశ్‌కు చైనా యుద్ధ విమానాలు.. భారత్‌కు సవాలేనా.?
- Trump: భారత్, చైనా టారిఫ్‌లపై వాణిజ్య మంత్రితో ట్రంప్ వాగ్వాదం.. ఏం జరిగిందంటే..!
- Iran invites PM Modi: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకండి.. మోడీకి ఇరాన్ ఆహ్వానం..
ఇది కూడా చదవండి: US: మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం
ఇప్పుడు ఈ జాబితాలో చైనా కూడా చేరింది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్‌తో పాటు చైనా కూడా కృషి చేసిందని విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రకటించారు. భారత్-పాకిస్థాన్‌తో పాటు ఉత్తర మయన్మార్ ఉద్రిక్తతలు, కంబోడియా-థాయ్‌లాండ్, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలు, ఇరాన్ అణు సమస్యతో పాటు ప్రపంచ సంఘర్షణలకు బీజింగ్ శాంతికర్తగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. ఇక ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు తర్వాత భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US: కోర్టు సంచలన తీర్పు.. గర్భంలో శిశువు మరణించినందుకు మహిళకు 18 ఏళ్ల జైలు శిక్ష
అయితే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన ఆయుధాల్లో చైనాకు సంబంధించినవి ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడేమో రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తామేనంటూ డ్రాగన్ దేశం చెబుతోంది. ఇప్పటికే ట్రంప్ వాదనను తోసిపుచ్చుతున్న భారత్.. చైనా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
-
Ginger Chutney: కొలతలతో నిల్వ ఉండే టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
-
Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
-
Mahua Moitra: ఆ రాత్రంతా ఏడ్చాను.. సువేందు అండగా ఉన్నారు.. మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
-
Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
ట్రెండింగ్
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!