Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: సాయికృష్ణ కేసులో సిట్ విచారణపై మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించిన ఆయన, ఈ కేసులో అనేక కీలక అంశాలను అధికారులు విస్మరించారని విమర్శించారు. విజయవాడలో జరిగిన సాయికృష్ణ ఘటన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పరిస్థితిని బయటపెట్టిందని పేర్ని నాని అన్నారు. కస్టోడియల్ డెత్ జరిగిన తర్వాత కూడా శవం ఏమైందో అధికార యంత్రాంగం స్పష్టంగా చెప్పలేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే చార్జ్‌షీట్ దాఖలైందని ఆరోపించారు.
సిట్ విచారణపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, మే 6న సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత చట్టపరమైన విధానాలు పాటించలేదని అన్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు, సంబంధిత ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్కరేనా? శవాన్ని ఎలా తరలించారు? సీసీటీవీ ఫుటేజీ ఎందుకు మాయమైంది? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లేవని అన్నారు. సాయికృష్ణ తల్లి పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా స్పందన రాలేదని, చివరకు హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో ‘రెడ్‌బుక్ పాలన’ పేరుతో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన పేర్ని నాని, లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఈ కేసులో సీపీ, డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల పాత్రపైనా స్వతంత్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇక, సీఐ నాగరాజు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారా? కాల్ డేటా, ఇంటర్నెట్ కాల్ వివరాలు సేకరించారా? సాయికృష్ణ ఫోన్ ఏమైంది? నగరంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారా? వంటి పలు ప్రశ్నలను ఆయన సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే ఉన్నతాధికారులను పక్కనపెట్టి పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!