Tragedy: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ధృవీకరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా పోస్ట్‌లో అక్తర్ స్పందిస్తూ.. “నా ప్రియమైన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ అల్లా చెంతకు చేరారని చెప్పడానికి నేను ఎంతో విచారిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియల (నమాజ్-ఎ-జనాజా) సమయం, వేదికను త్వరలోనే తెలియజేస్తానని వెల్లడించారు. అయితే.. షాహిద్ అక్తర్ మరణానికి గల ఖచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా ఈ విషాద వార్తను ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. షాహిద్ అక్తర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. హెచ్-8 శ్మశానవాటికలో అంత్యక్రియల ప్రార్థనలు జరుగుతాయని, అభిమానులందరూ ఆయన కుటుంబం కోసం ప్రార్థించాలని కోరారు. ఈ వార్త తెలియగానే పలువురు మాజీ క్రికెటర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులు షోయబ్ అక్తర్ కుటుంబానికి సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఐదేళ్ల క్రితమే అక్తర్ తన తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఇప్పుడు పెద్దన్నయ్య కూడా దూరమవ్వడంతో ఆయన కుటుంబంలో మరోసారి తీరని లోటు ఏర్పడింది.
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా షోయబ్ అక్తర్ ప్రపంచ క్రికెట్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రముఖ క్రీడా విశ్లేషకుడిగా, పండిట్‌గా పలు మీడియా ఛానెళ్ల చర్చల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ముగిసిన 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ ఆయన విశ్లేషకుడిగా వ్యవహరించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులోని పరిపాలనా లోపాలను, ఆటగాళ్ల ప్రదర్శనలను ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా విమర్శిస్తూ, 1990ల నాటి వైభవాన్ని పాక్ జట్టు మళ్లీ ఎలా సాధించాలో సూచిస్తూ అక్తర్ ఎప్పుడూ గళం విప్పుతుంటారు. ఈ కష్టసమయంలో అక్తర్ కుటుంబానికి క్రీడాలోకం అండగా నిలిచింది.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!