Mahua Moitra: ఆ రాత్రంతా ఏడ్చాను.. సువేందు అండగా ఉన్నారు.. మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
- మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
- స్వరం మార్చిన మమత సన్నిహితురాలు
- పొలిటికల్‌గా చర్చకు దారి తీసిన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తిరుగుబాటు ఎంపీలతో సతమతం అవుతున్న మమతా బెనర్జీ.. ఇప్పుడు సన్నిహితురాలు మహువా మొయిత్రా వ్యాఖ్యలు చూస్తుంటే ఈమె కూడా ప్లేట్ ఫిరాయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఆమె మాట్లాడిన వ్యాఖ్యలే ఉదాహరణగా ఉన్నాయి. 2014లో లోక్‌సభ టికెట్ రానప్పుడు ఆ రాత్రంతా ఏడ్చానని.. అప్పుడు సువేందు అధికారి మాత్రమే తనకు అండగా నిలిచారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆమె స్వరం మారుతోందని అర్థమవుతోంది.
ఒక ఇంటర్వ్యూలో మహువా మొయిత్రా మాట్లాడుతూ.. తాను, సువేందు అధికారి ఇద్దరూ టీఎంసీలో ఉన్న సమయంలో తనకు ఆయన ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తనకు పార్టీ టికెట్ వస్తుందని భావించినప్పటికీ చివరి క్షణంలో అవకాశం దక్కలేదని మహువా వెల్లడించారు. ఆ రాత్రంతా తాను ఏడ్చానని… ఆ సమయంలో తనను ఓదార్చిన వ్యక్తి సువేందు అధికారి అని గుర్తుచేశారు.
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
2016 అసెంబ్లీ ఎన్నికల్లో తాను తొలిసారి కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందర్భాన్ని కూడా మహువా గుర్తు చేసుకున్నారు. ‘‘నేను కరీంపూర్ నుంచి మొదటిసారి పోటీ చేసినప్పుడు నా కోసం ప్రచారానికి పెద్దగా ఎవరూ రాలేదు. నా తొలి ఎన్నికల ర్యాలీని నిర్వహించింది సువేందు అధికారి. ఇప్పటికీ ఆ ఫొటోలు ఉన్నాయి. ఆ వేదికపై నేను, సువేందు మాత్రమే ఉన్నాం.’’ అని చెప్పారు. 2020లో టీఎంసీని వీడి సువేందు అధికారి బీజేపీలో చేరినప్పటి నుంచి తమ మధ్య రాజకీయ దూరం పెరిగిందని మహువా పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు ఆయన వేరే పార్టీలో ఉన్నారు. మేము మాట్లాడుకోవడం లేదు. కానీ ఆయన నాకు చేసిన సహాయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను.’’ అని తెలిపారు.
‘‘టీఎంసీ బలహీనత ఏమిటంటే.. ఉపయోగం లేని నాయకులను కూడా పార్టీ కొనసాగించింది. వారు స్వతంత్రంగా ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం కలిగి ఉన్నారా లేదా అన్నది సమీక్షించాల్సి ఉండేది.’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యవస్థపై కూడా మహువా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బలమైన క్యాడర్ ఉందని.. పార్టీ క్రమబద్ధంగా పనిచేస్తుందన్నారు. స్పష్టమైన హిందుత్వ సిద్ధాంతం ఉందని.. ఆ పార్టీ ఒక్క వ్యక్తిపై ఆధారపడదని పేర్కొన్నారు.
టీఎంసీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందనే ప్రచారాన్ని మహువా పూర్తిగా ఖండించారు. ‘‘టీఎంసీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యే ప్రశ్నే లేదు. అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.’’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో మహువా మొయిత్రా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!