భారత్-పాకిస్థాన్ యుద్ధం విరమణ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని భారతదేశం మరోసారి తేల్చి చెప్పింది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్‌తో పాటు చైనా కూడా కృషి చేసిందని వ్యాఖ్యానించారు.
తాము కూడా ‘‘శాంతికాముకులం’’ అంటూ డ్రాగన్ దేశం చైనా కూడా కొత్త రాగం అందుకుంది. ట్రంప్‌తో పాటు చైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు ఆపిందని.. శాంతి చర్చల్లో పాల్గొందంటూ కొత్త పలుకు పలికింది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
యుద్ధాలను ఆపడం తనకు చాలా ఇష్టమని ట్రంప్ అన్నారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడారు. ఏ అధ్యక్షుడు కూడా ఒక్క యుద్ధాన్ని ఆపలేదని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను మాత్రం ఎనిమిది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పుకొచ్చారు. అయినా కూడా తనకు నోబెల్ బహుమతి వచ్చిందా? అంటే లేదన్నారు.
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని మళ్లీ ట్రంప్ ప్రకటించారు. స్కాట్లాండ్‌లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని లేవనెత్తారు.
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మళ్లీ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం అనేక మార్లు ఖండించింది. ఇరు దేశాల మధ్య చర్చల కారణంగానే కాల్పుల విరమణ జరిగిందని.. ఇందుకు మూడో వ్యక్తి ప్రమేయం ఏ మాత్రం లేదని భారత్ అనేక మార్లు మీడియా సముఖంగా ప్రకటించింది.