Ginger Chutney: కొలతలతో నిల్వ ఉండే టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ.. సింపుల్గా ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ginger Chutney: టిఫిన్ సెంటర్లలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఇడ్లీ, దోశల్లోకి ఇచ్చే ఎర్రటి అల్లం చట్నీ రుచి ఎలా ఉంటుందో తెలుసు కదా. చాలా అద్భుతంగా ఉండే ఆ అల్లం చట్నీని మీ ఇంట్లో తయారు చేసుకోవాలని అనుకుంటున్నారా. అయితే అదే రుచితో ఇంట్లోనే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. హోటల్ స్టైల్ రుచి కోసం దాదాపు 15 రకాల దినుసులను పక్కా కొలతలతో ఉపయోగించి ఈ చట్నీని తయారుచేసే విధానం ఇదే.
కావలసిన పదార్థాలు – కొలతలు..
ఎండుమిర్చి: 65 గ్రాములు
Also Read
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
అల్లం ముక్కలు: 100 గ్రాములు
బెల్లం: 300 గ్రాములు
శనగపప్పు: 50 గ్రాములు
మినప్పప్పు: 50 గ్రాములు
నువ్వులు: 25 గ్రాములు
ధనియాలు: 20 గ్రాములు
వెల్లుల్లి రేకులు: 15 గ్రాములు
చింతపండు: 30 గ్రాములు (అర గంట ముందు నానబెట్టుకోవాలి)
జీలకర్ర: 8 గ్రాములు
మెంతులు: 6 గ్రాములు
మిరియాలు: అర టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క: చిన్న ముక్క
ఉప్పు: 40 గ్రాములు (రుచికి సరిపడా)
నూనె: 150 ml
కరివేపాకు, పసుపు: తగినంత
తయారీ విధానం ఇదే..
ముందుగా ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక శుభ్రం చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి చిన్న మంటపై వేయించాలి. అల్లం వేగి మంచి సువాసన వస్తూ నూనెపై తేలేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, మిరియాలు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత జీలకర్ర, తెల్ల నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి వేయించాలి. ఎండుమిర్చి మాడిపోకుండా ఉండేందుకు మంటను పూర్తిగా సిమ్లో ఉంచి, దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలి.
ఇలా వేయించుకున్న దినుసులన్నింటినీ గ్రైండర్ (లేదా మిక్సీ) లో వేసి, కొద్దిగా దొడ్డు ఉప్పు, తగినన్ని నీళ్లు (సుమారు 150 ml) పోసి గ్రైండ్ చేయాలి. చట్నీ నలుగుతున్న సమయంలోనే గింజలు తీసేసిన చింతపండు, బెల్లం ముక్కలను కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చట్నీ పూర్తిగా మెత్తగా అయిన తర్వాత రుచి చూసుకుని అవసరమైతే మరికొంత ఉప్పును యాడ్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేస్తే దాదాపు 1 కేజీ 400 గ్రాముల చట్నీ రెడీ అవుతుంది. మిక్సీ కంటే గ్రైండర్లో రుబ్బడం వల్ల హోటల్ స్టైల్ టెక్స్చర్, రుచి వస్తాయని, ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెబుతున్నారు. కుదిరితే మీ ఇంట్లో కూడా ఒక సారి ట్రై చేసి చూడండి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..