Uganda Children: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గత శనివారం నాడు కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలో నిర్వహించిన సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా.. ఆదే సమయంలో అతనిపై బుల్లెట్ దూసుకొచ్చింది. అయితే, ఈ ఘటనను ఉగాండా చిన్నారులు సీన్ రీ- క్రియేట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను టిక్ టాకర్ బ్లడ్ అగ్ తీశారు. కాగా, ఈ వీడియో కోసం ఆ చిన్నారులు.. చెక్క రైఫిళ్లు, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించారు.
Read Also: Vizag Crime: పిల్లలను బెదిరించే ప్రయత్నం.. చీర బిగుసుకొని తండ్రి మృతి..
అయితే, ట్రంప్ మీద ఎటాక్‌పై సెటైర్‌లా ఉన్న ఈ వీడియోపై భారీగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంట్లో ఓ చిన్నారి .. డొనాల్డ్ ట్రంప్ పాత్రను పోషించాడు. పోడియం దగ్గర మాట్లాడుతున్న టైంలో బుల్లెట్ తగలగానే, చిన్నారితో పాటు అక్కడే ఉన్న సెక్యూరిటీ కింద దాక్కున్నట్లు ఆ వీడియోలో చిత్రీకరించారు. ఇక, ఆ సమావేశానికి హాజరైన జనం కూడా భయంతో కింద కూర్చుండిపోయిన విజువల్స్ ను కూడా సెమ్ టూ సెమ్ షూట్ చేశారు. రక్తం చిందుతున్నా.. డొనాల్డ్ ట్రంప్ తన పిడికిలి బిగించి పోరాడుతాం అనే డైలాగ్ కొట్టిన స్టైల్ లోనే.. ట్రంప్ పాత్ర పోషించిన పిల్లాడు ఒక్కసారిగా అరిచాడు. అయితే, డొనాల్డ్ ట్రంప్‌ను సీక్రెట్ సర్వీస్ సేఫ్ గా తీసుకెళ్తున్న సీన్‌ను కూడా ఉగాండా చిన్నారులు అద్భుతంగా రీ- క్రియేట్ చేశారు. కానీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వీడియో తీయడంపై నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు నెట్టింట లక్షల్లో లైక్స్, వ్యూస్ వచ్చాయి.
Ugandan Kids re-enact the Trump Assassination Attempt pic.twitter.com/2tck8GNa23
— ɖʀʊӄքǟ ӄʊռʟɛʏ 🇧🇹🇹🇩 (@kunley_drukpa) July 17, 2024