Vizag Crime: పిల్లల అల్లరి ఆపడానికి పెద్దలు.. బెదిరిస్తుంటారు.. మరీ శృతిమించితే.. చేతికో.. కర్రకో పని చెబుతారు.. కొందరైతే నేను ఈ అల్లరి భరించలేను.. చచ్చిపోతా అని కూడా బెదిరించేవాళ్లు లేకపోలేదు.. అయితే, అల్లరి చేస్తున్న పిల్లలను బెదిరించే ప్రయత్నంలో ఓ తండ్రి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో ఈ ఘటన విషాదంగా మారింది..
Read Also: Donald Trump: ఆ దేవుడి ఆశీస్సులే నన్ను కాపాడాయి..
గోపాలపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతా అంటూ పిల్లల అల్లరిని మానిపించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలను తీసింది.. గోపాలపట్నంలో నివాసం ఉంటుంది బీహార్‌కు చెందిన ఓ ఫ్యామిలీ.. అయితే, చందన కుమార్ పిల్లలు బాగా అల్లరి చేశారు.. ఈ క్రమంలో డబ్బులు కూడా చించివేయడంతో వారిపై సీరియస్ అయ్యాడు చందన కుమార్.. వారిని కొట్టేందుకు వెళ్తే.. భార్య అడ్డుపడింది.. ఈ క్రమంలో పిల్లలను, భార్యను బెదిరించే ప్రయత్నం చేశాడు చందన్.. ఇంట్లో ఫ్యాన్ కు చీరకట్టి పిల్లలను భయపెట్టే ప్రయత్నం చేశాడు.. ఉరి వేసుకుంటాను అంటూ బెదిరించే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా ఆ చీర గొంతుకు బిగుసుకుపోయింది.. దీంతో.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు చందన్ కుమార్.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేట్టారు..