ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను సాధారణంగా దొంగలు టార్గెట్ చేస్తుంటారు. దొంగతనాలకు పాల్పడుతుంటారు. అయితే, ఓ దొంగమాత్రం ఇంట్లో అందరూ ఉన్నారని తెలిసికూడా దొంగతనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. కింద ఇంట్లో అందరూ ఉండగా పైన ఉన్న ఇంట్లోకి దూరిన దొంగ బట్టలు విప్పేసి టవల్ కట్టుకొని స్నానాల గదిలోకి దూరి స్నానం చేయడం మొదలు పెట్టాడు. అయితే, కింద గదిలో అప్పటికే మేల్కొని ఉన్న మహిళ, అలికిడిని గమనించి భర్తను నిద్రలేపింది. భర్త గన్ తీసుకొని పైగదిలోకి వెళ్లింది. అలా వెళ్లిన వాళ్లకు దొంగ టవల్ కట్టుకొని ఎదురు వచ్చాడు. దొంగను గన్‌తో నిలువరించి, పొలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి దొంగగారిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారు. ఈ సంఘటన క్యాలిఫోర్నియాలోని మిడో విస్టాలో జరిగింది.